close
Choose your channels

'జార్జ్ రెడ్డి' ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ ?

Tuesday, November 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జార్జ్ రెడ్డి  ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ ?

నిజాం క‌ళాశాల‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీల్లో చ‌దువుకునే రోజుల్లో విద్యార్థి నాయ‌కుడిగా ఎంద‌రో విద్యార్థుల‌ను ప్ర‌భావితం చేశారు. కాలేజీ విద్యార్థుల‌కు, రాజ‌కీయాల‌కు ఒక‌ప్పుడు దగ్గ‌ర సంబంధాలుండేవి. ఆ నేప‌థ్యంలో జ‌రిగే కాలేజీ గొడ‌వ‌ల్లో ఆయ‌న్ని కొంద‌రు దుండ‌గులు హ‌త్య చేశారు. అయితే ఆయ‌న ర‌గిల్చిన విప్ల‌వ భావాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆయ‌న జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం `జార్జ్ రెడ్డి`. `వంగ‌వీటి` ఫేమ్ సందీప్ మాధ‌వ్‌(సాండి) ఇందులో టైటిల్ పాత్ర‌ను పోషించారు. ద‌ళం ఫేమ్ జీవ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ 22న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. త్రీ లైన్స్‌, సిల్లీమాంక్స్ స్టూడియో, మైక్ మూవీస్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 17న నిర్వ‌హించ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిథిగా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ర‌ప్పించ‌డానికి చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ట‌. సాధార‌ణంగా విప్ల‌వ భావాలున్న ప‌వ‌న్ క‌ల్యాన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో ఓ క్లారిటీ రానుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.