ఎల్లుండి ఎస్పీవై రెడ్డి ఇంటికి జనసేనాని

  • IndiaGlitz, [Thursday,May 09 2019]

నంద్యాల ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ రెడ్డి తుదిశ్వాస విడిచారు. కాగా.. అంత్యక్రియలకు కొన్ని అనివార్యకారణాల వల్ల వెళ్లలేకపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 11వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లనున్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. 2019 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు పోటీ చేశారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి శాసనసభ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్‌ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేశారు. మే-23న వెల్లడికానున్న ఫలితాల్లో ఈ ముగ్గురి భవితవ్యం తేలనుంది.

More News

‘7’ ట్రైలర్ కిరాక్.. ఇంతకీ ఆ అమ్మాయిలను చంపిందెవరు!?

క్రైమ్‌ థ్రిల్లర్స్‌ సంబంధించి సినిమాలను తెరకెక్కించడానికి తెలుగు డైరెక్టర్స్ ఇప్పుడు అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. ‘కల్కి’ ట్రైలర్ రివ్యూ

యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌, ఆదాశర్మ, నందిత శ్వేత నటీనటులుగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి’.

టీవీ9 వివాదం వెనుక ఉన్నదెవరు..? రవిప్రకాష్ బాగోతం బట్టబయలు!!

టీవీ9 సీఈవో వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఫోర్జరీ వివాదంపై క్లారిటీ.. తోటి చానెళ్లకు గడ్డిపెట్టిన టీవీ9 రవిప్రకాష్!!

టీవీ9 సీఈవో రవిప్రకాష్‌లో సంతకం ఫోర్జరీ కేసు నమోదైందని.. ఆయన రెండ్రోజులుగా పరారయ్యారని పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీలో గెలుపెవరిదో తేల్చేసిన లక్ష్మీపార్వతి

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు తెరెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఇంకా ఏపీలో విడుదల కాలేదు.