Pawan Kalyan:పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్..!

  • IndiaGlitz, [Thursday,November 16 2023]

పవర్ స్టార్ అభిమానులకు కొంత బ్యాడ్ న్యూస్ లాంటి వార్త ఇది. ఇటు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పవన్ బిజీగా ఉన్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే అటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయం కావడంతో రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి అవసం ఏర్పడింది. దీంతో ముందుగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాలు పూర్తిచేయాలని కొన్ని రోజులు కేటాయించి షూటింగ్ మొదలెట్టారు. ఈ క్రమంలో 'ఓజి' షూటింగ్‌లో పవన్ పార్ట్ పూర్తైనట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ కావడంతో పూర్తిగా రాజకీయాలకే తన సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో దర్శకుడు హరీష్ శంకర్‌ని పిలిచి వేరే సినిమా చేసుకోమని చెప్పినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యాక షూటింగ్ చేద్దామని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతో ఇప్పటికే హరీశ్.. మాస్ మహారాజా రవితేజతో తన తదుపరి సినిమా స్టార్ట్ చేసినట్లు టాక్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 20 నుంచి ప్రారంభంకానుందని.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీనిని నిర్మిస్తుందని భోగట్టా.

ఇక సుజిత్ దర్శకత్వం వహిస్తున్న'ఓజి'లో మాత్రం పవన్ పాత్ర షూటింగ్ కంప్లీట్ కావడంతో ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో రానున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 80శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మొత్తానికి వచ్చే ఏడాదిలో జరగనున్న ఏపీ ఎన్నికల తర్వాత పవన్ సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి.

More News

Balakrishna:ఇక యుద్ధం మొదలైంది.. పవన్ కల్యాణ్‌పై బాలకృష్ణ ప్రశంసలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. తాను, పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడే మనుషులమని తెలిపారు.

Vijayashanthi:బీజేపీకి విజయశాంతి రాజీనామా.. కాంగ్రెస్ పార్టీలోకి రాములమ్మ..?

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా..

Bigg Boss Telugu 7 : ప్రశాంత్‌కు రతిక మరో వెన్నుపోటు .. అర్జున్ మాటలకు శోభ కంటతడి, ‘‘ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ’’లో ట్విస్టులు

బిగ్‌బాస్ 7 తెలుగులో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సోమ, మంగళవారాల్లో నామినేషన్స్ రచ్చ నడవగా..

Chandrababu: చంద్రబాబుకు గుండె సమస్య.. ఏపీ హైకోర్టుకు వైద్యుల నివేదిక..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ హైకోర్టుకు ఆయన తరపు న్యాయవాదులు నివేదిక సమర్పించారు. అయితే ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు.

Telangana Congress: రెబల్స్ విషయంలో ఫలించిన కాంగ్రెస్ వ్యూహం

తెలంగాణ ఎన్నికల్లో నేటితో నామినేషన్ల ఉపంసహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2898 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. అత్యధికంగా గజ్వేల్‌ బరిలో 86 మంది అభ్యర్థులు నిలవగా..