2020 రికార్డ్ ‘వకీల్‌సాబ్’దే

  • IndiaGlitz, [Monday,December 14 2020]

2020.. చాలా కాలం తర్వాత ప్రపంచాన్ని వణికించింది. ఎక్కడికక్కడ స్తంభింపజేసింది. ఈ ఏడాది ఒక్కొక్కరికీ ఒక్కో ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ఇక సినీ ప్రపంచం అయితే ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికీ కోలుకోలేదు. దీంతో ప్రజానీకం డిజిటల్ ప్రపంచానికి దగ్గరైంది. అయితే ఇటీవలి కాలంలో సినిమాలకు సంబంధించిన ఒక్కొక్క అప్‌డేట్ బయటకు వస్తోంది. దీంతో నెటిజన్లు తమ అభిమాన హీరో సినిమా అప్‌డేట్ కోసం చాలా ఆసక్తిగా సోషల్ మీడియాను ఆశ్రయించారు.

కాగా.. మరికొన్ని రోజుల్లో 2021లో అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా.. 2020కి సంబంధించిన ట్విట్టర్‌ లెక్కలను ఒక్కొక్కటిగా ట్విట్టర్‌ ఇండియా బయటపెడుతోంది. ఈ క్రమంలోనే ఏ హీరో, హీరోయిన్‌ పేరు బాగా ట్రెండ్‌ అయ్యింది, ఏ సినిమా పేరు టాప్‌ స్థానాన్ని ఆక్రమించిదనే లెక్కలను తాజాగా ట్విట్టర్‌ విడుదల చేసింది. అందులో తెలుగు సినిమా విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న 'వకీల్‌సాబ్‌' చిత్రం టాప్‌లో నిలిచింది.

మోస్ట్ ట్విట్‌డ్‌ తెలుగు మూవీ ఇన్‌ 2020గా 'వకీల్‌సాబ్‌' చిత్రం టాప్‌ ప్లేస్‌లో నిలిచినట్లుగా ట్విట్టర్‌ ఇండియా ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు ఫుల్లు ఖుషీలో ఉన్నారు. నిజానికి ‘వకీల్‌సాబ్’కి సంబంధించి ఓ రెండు అప్‌డేట్స్ మినహా ఇప్పటి వరకూ ఇతర అప్‌డేట్స్ ఏమీ రిలీజ్ అవలేదు. ఒక మోషన్ పోస్టర్, ఒక పాటతోనే 'వకీల్‌సాబ్‌' టాప్ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More News

గూగుల్ సర్వర్లు గంటపాటు డౌన్

గూగుల్ సర్వర్లు ఇవాళ షాకింగ్‌గా గంట పాటు పని చేయకుండా పోయాయి. సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారిగా గూగుల్‌కు చెందిన ప్రధాన సర్వీసుులు జీమెయిల్, యూట్యూబ్, ఫోటోస్,

'ఆచార్య' రిలీజ్ డేట్ ఖ‌రారైందా..?

గ‌త ఏడాది ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి అంత స్కోప్ లేకుండా పోయింది. తాజాగా ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న

బిగ్‌బాస్ హౌస్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ద్దతు ఎవ‌రికో తెలుసా?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4 ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఆదివారం మోనాల్ బిగ్‌బాస్ ఇంటి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అభిజీత్‌, అఖిల్‌, హారిక‌, అరియానా, సోహైల్ ఫైన‌ల్‌కు చేరుకున్నారు.

టీఆర్‌ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారంపై స్పందించిన కిషన్‌రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు..

'డర్టీ హరి' నిర్మాతపై కేసు నమోదు

క్లాసిక్‌ హిట్స్ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన నిర్మాత ఎంఎస్‌ రాజు, లాంగ్ గ్యాప్ తరువాత యూత్‌ను టార్గెట్ చేస్తూ ఓ బోల్డ్ అడల్ట్ కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.