వరద సాయం నిలిపివేత.. మిన్నంటిన ఆగ్రహావేశాలు..

  • IndiaGlitz, [Thursday,November 19 2020]

రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం కింద అందిస్తున్న రూ.10 వేల కోసం ప్రజలు విరివిగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే నేడు ఎన్నికల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వరద సాయాన్ని వెంటనే నిలిపేయాలని బుధవారం ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో వరద సాయం పంపిణీతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ నిలిపివేసి.. అనంతరం చెల్లించుకోవచ్చని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరద సాయానికి సడెన్‌గా బ్రేక్ పడింది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు జంట నగరాలను ముంచెత్తాయి. హైదరాబాద్‌లోని ప్రతి ఏరియా మునిగిపోయింది. ఇక కొన్ని ప్రాంతాల వాసులైతే సర్వస్వం కోల్పోయారు. ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ క్రమంలోనే తొలుత కొందరికి సాయం అందించారు. అయితే ఆ సాయం అసలైన వ్యక్తులకు చేరట్లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి కేటీఆర్ మీ సేవ లేదంటే ఈ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు మీసేవ, ఈసేవ కేంద్రాలకు పరుగులు పెట్టారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వరద సాయాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

తెల్లవారు జాము నుంచే క్యూలైన్లలో నిలబడి నానా తిప్పలు పడుతున్న ప్రజానీకానికి ఒక్కసారిగా వరద సాయం నిలిపివేత ప్రకటనతో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. బాధితులంతా రోడ్ల పైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల వరద బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల జనం మీ-సేవా కేంద్రాల వద్దే ఆందోళనకు దిగారు. కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో రోడ్డుపై మహిళలు బైఠాయించారు. రాంనగర్‌లో సిటీ బస్సులను వరద బాధితులు నిలిపివేశారు. వనస్థలిపురంలో తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

More News

కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవద్దు: రఘురామ

వైసీపీ పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి.. ఎన్నికల నిర్వహణకు ఎందుకని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.

నిమ్మగడ్డ రమేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన రమేష్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

'లవ్ స్టోరి' షూటింగ్ పూర్తి

ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ''లవ్ స్టోరి''.

ఖుష్బూకు తప్పిన పెను ప్రమాదం..

బీజేపీ నాయకురాలు నటి ఖుష్బూ సుందర్‌కు పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ఖష్బూకు గాయాలయ్యాయి.

జీహెచ్ఎంసీ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన జనసేన..

జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు మంగళవారం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.