అమరావతి రైతులకు హామీ ఇచ్చిన మంత్రి నాని

నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో అమరావతి ప్రాంతంలో రైతులు రాస్తారోకోలు, ర్యాలీకి దిగారు. ఈ క్రమంలో ఈ రాజధాని రైతులకు మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సమావేశంలోని వివరాలను వెల్లడించారు. ‘కొందరు జగన్‌ వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారు.

40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి చేయలేని కార్యక్రమాలను మనం చేయగలమా?. రూ.5 వేల కోట్ల అప్పుకే 575 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రూ.లక్ష కోట్ల అప్పు తెస్తే ఎన్ని వేల కోట్ల వడ్డీ కట్టాలి?. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందవద్దు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రైతులపై కక్ష గట్టే ప్రభుత్వం కాదిది. జీఎన్‌.రావు కమిటీని కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. ఇప్పుడెందుకు మౌనదీక్ష చేస్తున్నారు ఆయనకే తెలియాలి. పౌరసత్వ బిల్లులో ఉన్న అపోహలను కేంద్రం తొలగించలేదు. మెజార్టీ ప్రజల ఆకాంక్షను జగన్‌ గౌరవిస్తారు’ అని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

More News

ఏపీ కెబినెట్‌లో ఏం చర్చించారు.. కీలక నిర్ణయాలేంటి!?

నవ్యాంధ్రకు మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కెబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

`ఎంత మంచివాడ‌వురా` మాస్ బీట్ సాంగ్ జాత‌రో జాత‌ర‌... విడుద‌ల

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా  'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్

జనవరి 3న హైదరాబాద్‌లో రజనీకాంత్ 'దర్బార్' ప్రీ రిలీజ్ ఫంక్షన్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా 'దర్బార్‌'.

నేను తప్పు మాట్లాడితే మీ బూటు విసరండి!: నాని

నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో అమరావతి ప్రాంతంలో రైతులు రాస్తారోకోలు, ర్యాలీకి దిగారు.

'భీష్మ' తొలి గీతం విడుదల

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై