BJP leader Laxman:ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి.. బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్..

  • IndiaGlitz, [Thursday,March 28 2024]

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు తాము కూడా ట్యాపింగ్ బాధితులం అంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. రెండో, మూడో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చునని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారని.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు.

ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్క్‌లు, సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నీడను కూడా నమ్మరని.. అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పలువురి ఫోన్ ట్యాప్ చేశారన్నారు. అసెంబ్లీ, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. ట్యాపింగ్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని.. వీటిపై త్వరగా దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మద్యం కేసులో కవిత అరెస్టయ్యారని.. తెలంగాణ సంపదను దోచుకున్న వారికి శిక్ష పడాల్సిందే అన్నారు.

ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ నుంచి కదల్లేదని.. ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్లలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పథకాల్లో కుంభకోణాలు, కమీషన్లు నడిచాయని తెలిపారు. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం ఇంకా పోవడం లేదని విమర్శించారు. ఇక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని.. ఈ రెండు పార్టీల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెర మీదకి తెస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. అందుకే ట్యాపింగ్ వ్యవహారం సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి లీకువీరుడు కాదు గ్రీకువీరుడు అని నిరూపించుకోవాలని వెల్లడించారు.

More News

YSJagan:విజయమ్మ ఆశీర్వాదంతో జగన్ తొలి అడుగు.. మళ్లీ మనమే రావాలంటూ పిలుపు..

సీఎం జగన్ ఏపీలో ఎన్నికల వేడి పెంచారు. ఇప్పటికే 'సిద్ధం' సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జగన్..

Family Star:కొత్తగా బ్రేక్‌లు ఇవ్వకున్నా పర్వాలేదు.. 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ వచ్చేసింది..

రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. తనకు 'గీత గోవిందం' లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో

BJP:ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

Kejriwal:లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట

లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.

Chandrababu:60 రోజుల్లో మెగా డీఎస్సీ.. ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగాలు ఇస్తాం: చంద్రబాబు

పరదాల వీరుడు సీఎం జగన్‌తో జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు సూచించారు.