28న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆకస్మికంగా ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని మోదీ పరిశీలించనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు రానున్నారు.

28వ తేదీ సాయంత్రం 4:10కి హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు. వచ్చిన గంటలోనే తిరిగి మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. తిరిగి సాయంత్రం 5:10 గంటలకు మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ రాక ఉత్కంఠ రేపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీ తరుఫున ప్రచారానికి అతిరథ మహారథులు రానున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్ వచ్చి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

నేడు(శుక్రవారం) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేయనున్నారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేధావుల సభకు హాజరవుతారు. అనంతరం, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్డు షోలో నడ్డా పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఈనెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కి రానున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌ షోలో అమిత్‌ షా పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు.

More News

బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది.

అదరగొట్టేసిన అఖిల్, సొహైల్...

ఓపెనింగే.. హారిక.. అభి ఫీల్ అయిన విషయాన్ని మోనాల్‌కు చెప్పింది. గతంలో తనకు.. అభికి మధ్య జరిగిందంతా హారికకు మోనాల్ చెప్పింది.

ప‌దేళ్ల త‌ర్వాత సునీల్‌తో జోడీ క‌డుతున్న హీరోయిన్‌

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు.

ఆ విషయం సీఎం కేసీఆరే బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

కొన్ని అరాచక శక్తులు తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాయంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై

జీహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో విడుదల..

గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ నేడు విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.