పీవోకే భారత్‌లో అంతర్భాగమే.. ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలుసు!

  • IndiaGlitz, [Tuesday,August 06 2019]

కశ్మీర్‌ విభజన బిల్లుపై మంగళవారం నాడు సుధీర్ఘ చర్చ సాగింది. ఈ సందర్భంగా మొదట లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం పలు పార్టీలకు చెందిన ఎంపీలు దీనిపై మాట్లాడారు. అయితే కొందరు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించగా.. మరికొందరు మాత్రం అమిత్‌షా-మోదీ ఇద్దరూ కీలక నిర్ణయం తీసుకున్నారని శభాష్ అని మెచ్చుకున్నారు. ఎంపీల ప్రసంగం అనంతరం షా సుధీర్ఘ ప్రసంగం మొదలుపెట్టారు. సుమారు గంటన్నరకు పైగా షా ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నారు. ఆర్టికల్‌ 370 కారణంగానే భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరుగా చూశారని.. ఆర్టికల్‌ 370 రద్దుతో 70 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రధాని మోదీది సాహసోపేతమైన నిర్ణయమని ఈ సందర్భంగా షా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ తీసుకున్న నిర్ణయం వల్లే సమస్యకు పరిష్కారం లభించిందని.. పరిస్థితులన్నీ చక్కబడగానే కశ్మీర్‌కు రాష్ట్రహోదా ఇస్తామని అమిత్ షా తేల్చిచెప్పారు.

ఆపరేషన్ పీవోకే..!

ఈ సందర్భంగా పీవోకే గురించి మాట్లాడిన అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే భారత్‌లో అంతర్భాగమేనని.. ఎవరి ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం తలొగ్గదని తేల్చిచెప్పారు. అంతేకాదు.. రాజకీయ దురుద్దేశంతో చేసే విమర్శలు పట్టించుకోమన్న ఆయన.. పీవోకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు. నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్‌ నుంచి చేజారిందని నాటి ప్రభుత్వంపై షా విమర్శలు గుప్పించారు. షా వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి టార్గెట్ ‘పీవోకే’.. త్వరలోనే ‘ఆపరేషన్ పీవోకే’ను ప్రారంభించించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

పాక్‌ తొత్తులతో ఎలాంటి చర్చలు జరపబోం!

లోయలో ఉన్నవాళ్లంతా మా వాళ్లే. లోయలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలో మేం చేస్తాం. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాకిస్థానే కారణం. పాక్‌ తొత్తులతో ఎలాంటి చర్చలు జరపబోం. 370 రద్దుపై ఎప్పుడు చర్చ జరిగినా ప్రజలంతా మోదీని గుర్తు చేసుకుంటారు. చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదిస్తున్నారని విమర్శిస్తున్నారు. 70 ఏళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌ నుంచి ప్రేరణ పొందినవారితో చర్చలు జరపాలా?. పాక్‌ కుటిల నీతి వల్లే కశ్మీర్‌లో యువత ఆయుధాలు పట్టుకుంది. మేం ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ముందుకెళ్తున్నాం. 370 రద్దు నిర్ణయం మంచిదా? చెడ్డదా? అనేది భవిష్యత్‌ నిర్ణయిస్తుంది. ఆర్టికల్‌ 370ని 371తో పోల్చవద్దు అని ఈ సందర్భంగా షా తేల్చిచెప్పారు.

More News

పొగ తాగితే తప్పేంటి? అని అంటున్న- రకుల్

రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన చిత్రం `మన్మథుడు 2`. ఈ చిత్రంలో ఈమె అవంతిక అనే పోర్చుగల్ అమ్మాయిగా నటించింది.

'ఉండి పోరాదే' చిత్రంతో నిర్మాతగా డా.లింగేశ్వ‌ర్ త‌ప్ప‌కుండా  మంచి స‌క్సెస్ సాధిస్తారు - రాజ్ కందుకూరి

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉండి పోరాదే'.

అమెజాన్‌‌కు ధీటుగా రంగంలోకి ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియోస్‌’...

కొత్త సినిమాలు చూడాలన్నా.. సినిమా మంచి క్లారిటీతో మనస్పూర్తిగా చూడాలన్నా మొదట గుర్తొచ్చేది అమెజాన్.. యూ ట్యూబ్ మాత్రమే.

ఇవాళ ఒక్క సీటే రేపు అసెంబ్లీ మొత్తం జనసేనదే..!

‘నన్ను ప్రాణప్రదంగా చూసే ఒక్క జ‌న‌సైనికుడు ప‌క్క‌న ఉన్నా పార్టీని న‌డుపుతాన‌ు. నేడు ఒకే ఒక్క ఎమ్మెల్యే....

‘శివలింగం’ పేరుతో కోటీశ్వరులవ్వాలని కటకటాల్లోకి!

మోసపోయేవాళ్లు ఉన్నన్ని రోజులు మోసం చేసేవాళ్లు ఉంటారనే పెద్దలు చెబుతూ ఉంటారు.