close
Choose your channels

అమెజాన్‌‌కు ధీటుగా రంగంలోకి ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియోస్‌’...

Tuesday, August 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త సినిమాలు చూడాలన్నా.. సినిమా మంచి క్లారిటీతో మనస్పూర్తిగా చూడాలన్నా మొదట గుర్తొచ్చేది అమెజాన్.. యూ ట్యూబ్ మాత్రమే. అయితే యూ ట్యూబ్‌లో సినిమాలు అంత తొందరగా రావు గనుక ఫస్ట్ చాయిస్ అమెజాన్‌కు మాత్రమే. అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే చాలు.. ఇక బోలెడన్ని సినిమాలు చూసేయచ్చు. అలా ప్రస్తుతం అమెజాన్‌లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే జనాలంతా దీన్నే వాడేలా చేసుకుంది.

అమెజాన్‌‌కు పోటీగా తన చిరకాల ప్రత్యర్థి అయిన వాల్‌మార్ట్‌ సారథ్యంలోని ‘ఫ్లిప్‌కార్ట్‌’ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తోంది. త్వరలోనే ప్రాంతీయ భాషల్లో వీడియో స్ట్రీమింగ్‌ సేవలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు ఇటీవల ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియోస్‌’ పేరిట త్వరలోనే ఈ సర్వీస్ ప్రారంభం కానున్నట్లు సదరు సంస్థ తెలిపింది. అయితే ప్లిప్‌కార్ట్ మాత్రం ఓ బంపరాఫర్‌తో జనాల ముందుకు వస్తోంది. ప్రకటనల ఆదాయంతో నిర్వహించే ఈ సర్వీసు.. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ను ఉపయోగించే యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

షార్ట్‌ ఫిలిమ్‌లు, పూర్తి నిడివి సినిమాలు, సిరీస్‌లు మొదలైనవి ఫ్లిప్‌కార్ట్‌ వీడియోస్‌లో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. కాగా.. మొదట హిందీతో ప్రారంభించి ఆ తర్వాత దశల్లో తమిళం, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా కంటెంట్‌ అందించనున్నట్లు స్పష్టం చేసింది యాజమాన్యం. ఇదిలా ఉంటే.. పండుగ సీజన్‌ రానున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ప్రత్యర్థిని ఢీ కొట్టి ప్లిప్ కార్ట్ సక్సెస్ అవుతుందా..? అమెజాన్ మాదిరిగా కాకుండా మంచి ప్యాక్‌తో జనాల్లోకి వచ్చి ‘ఫ్లిప్‌కార్ట్’.. ‘ఫిదా’ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.