ఏప్రిల్ లో విజయ్ పోలీసోడు భారి విడుదల

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు టైటిల్ ను అధికారికం గా ప్రకతిచటం జరిగింది.

'రాజా రాణి' చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి. భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.

"తుపాకి వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫాం లో ఉన్న విజయ్ హీరో గా, రాజా రాణి తో మంచి పేరు తెచ్చుకున్న అట్లి దర్శకత్వం లో వస్తోన్న ఈ చిత్రం తెలుగు లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల అవుతుంది. ఈ చిత్రానికి తెలుగు లో పోలీసోడు అనే మాస్ టైటిల్ ను ఖరారు చేసాం. ఏప్రిల్ లో భారీ విడుదల కు ప్లాన్ చేస్తున్నాం ", అని దిల్ రాజు తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆడియో వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు

దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను

More News

ఊపిరి చిత్రానికి వెంక‌య్య‌నాయుడు అభినంద‌న‌లు

మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఊపిరి సినిమాను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. శనివారం ఈ సినిమాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ..

సర్ధార్ లో బ్రహ్మి క్యారెక్టర్ ఇదే...

పవర్ స్టార్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంతలా హాస్యాన్ని పండించిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా బ్రహ్మానందం క్యారెక్టర్ హైలెట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం.

మళ్లీ 'కందిరీగ' కాంబినేషన్....

ఎనర్జిటిక్ స్టార్ రామ్,కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ రాబోతుంది.

పవన్-మహేష్ నిర్మాతకు ఏడాది జైలు శిక్ష...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సూపర్ స్టార్ మహేష్...వీరిద్దరితో సినిమాలు నిర్మించిన నిర్మాతకు ఏడాది జైలు శిక్షా...

ప్ర‌మోష‌న్ షూరూ చేసిన స‌ర్ధార్..

ప‌వ‌ర్ స్టార్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండ‌డంతో ప్ర‌మోష‌న్ షూరూ చేసింది స‌ర్ధార్ టీమ్. నిన్న డైరెక్ట‌ర్ బాబీ స‌ర్ధార్ విశేషాల‌ను మీడియాతో పంచుకోగా....నేడు స‌ర్ధార్ సినిమాలోని టైటిల్ సాంగ్, ఐటం సాంగ్, ప్రొమోస్...రిలీజ్ చేసారు.