రేణు దేశాయ్‌కి అభినందనలు తెలిపిన పూనమ్ కౌర్
- IndiaGlitz, [Tuesday,June 19 2018]
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. తనకు తోడు దొరికాడని ఇటీవల తన చేతిని పట్టుకున్న వ్యక్తి చేతిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఈమెకు నెటిజన్లు మద్ధతు పలికారు. తన భవిష్యత్ బావుండాలని అభిలషించారు.
తాజాగా ఈ కోవలో పూనమ్ కౌర్ చేరింది. పవన్ మాజీ ప్రేయసి అంటూ ఆరోపణలు ఎదుర్కొన్న పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా రేణు దేశాయ్‌కి అభినందనలు తెలియచేసింది. గాయపడ్డ పక్షి రెక్కల గాయాలు నయమైయ్యాయి. మరో అద్భుతమైన ప్రయాణం మొదలు కానుంది. తన ఆలోచనల్లో కానీ.. తన చుట్టూ కానీ ఎటువంటి చెడు ఉండకూడదు. నేను ఒక స్త్రీగా మరో స్త్రీ సంతోషాన్ని కోరుకుంటున్నాను. నువ్వు సంతోషంగా ఉండటమే కాదు.. నీ తోటి వారిని కూడా సంతోషంగా ఉంచు అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది.
రేణు దేశాయ్ ఇటీవల తాను తనకు తోడు దొరికిందని.. చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే పూనమ్ రేణు దేశాయ్ తన గతాన్ని మరచి ఆనందంగా ఉండాలని కోరినట్టు తెలుస్తుంది.