close
Choose your channels

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో నాని?

Tuesday, June 19, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో నాని?

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నేచుర‌ల్ స్టార్ నాని విజ‌య‌ప‌రంప‌ర‌కి.. `కృష్ణార్జున యుద్ధం` బ్రేక్ వేసింది. అయిన‌ప్ప‌టికీ నాని జోరు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఒక వైపు కింగ్ నాగార్జున‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తూనే.. మ‌రో వైపు బిగ్ బాస్ సీజ‌న్ 2లో అల‌రిస్తున్నారు. తాజాగా మ‌ళ్ళీ రావా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌లో `జెర్సీ` చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్‌తోనూ నాని ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల నాని, పూరీ మ‌ధ్య ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. మాస్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో నాని ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించ‌ని లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తో క‌నిపించే అవ‌కాశ‌ముంద‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.