Pothina Mahesh: పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారు.. పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Monday,April 08 2024]

జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీకి అమ్ముడుపోయారని.. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. త్వరలోనే ఆధారాలను బయపెడతానంటూ పేర్కొన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం కాపు యువతను మోసం చేయొద్దంటూ మహేశ్ సూచించారు. పార్టీ నిర్మాణం, క్యాడర్‌పై ఏనాడూ దృష్టి సారించలేదని విమర్శించారు. ఎన్నికల తరువాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా? 21 సీట్లతో పార్టీకి, ప్రజలకు ఏం భవిష్యత్ ఇవ్వగలరని ప్రశ్నించారు.

పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని.. ఇప్పుడు తమ కుటుంబం రోడ్డు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎందుకు సీట్లు కేటాయించలేదని.. టీడీపీ వారికే ఎందుకు సీట్లు ఇచ్చారు? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఏ విధంగా సీట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. పచ్చనోట్లు పడేస్తే అన్ని మర్చిపోతారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో జనసేన పార్టీని చంపేశారని.. కుక్క బిస్కెట్స్ పడేసినట్లు చంద్రబాబు జనసేనకు 10 స్థానాలు పడేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

బీజేపీతో పొత్తు కుదిరితే జనసేన ఎందుకు సీట్లివ్వాలి? పొత్తు కుదిర్చితే సీట్లు ఎందుకు తగ్గించుకోవాలి? కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మకం ద్రోహం చేస్తారా అంటూ వాపోయారు. గెలిచే పశ్చిమ నియోజకవర్గం సీటును ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గం సీటును పెత్తందారుడైన సుజనా చౌదరికి కాకుండా వేరే వారికి ఇచ్చి ఉంటే సహకరించే వాడినని తెలిపారు.

కాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీజేపీకి వెళ్లడంతో అక్కడ సీటు ఆశించిన పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. ఇన్ని సంవత్సరాలు పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చిన మహేష్.. ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేయడం ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా చంద్రబాబుకు అమ్ముడుపోయారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మరి పోతిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ మాటలకు విలువేదీ..? గతంలోనూ తప్పిన అంచనాలు..

ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ గతంలో కొన్ని పార్టీల తరపున పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి బీహార్‌ రాజకీయాల్లో అడుగుపెట్టారు

Pothina Mahesh: జనసేన పార్టీకి భారీ షాక్.. కీలక నేత పోతిన మహేష్ రాజీనామా..

ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. విజయవాడలో పార్టీ కీలక నేతగా ఉన్న పోతిన మహేష్ రాజీనామా చేశారు.

Kavitha: కవితకు భారీ షాక్.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత..

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

అమ్మవారిగా బన్నీ విశ్వరూపం.. 'పుష్ప' గాడి మాస్ జాతర మొదలైంది..

'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.

థియేటర్లలో అలరించేందుకు భారతీయుడు సిద్ధం.. ఎప్పుడంటే..?

లోక నాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కలయికలో 'ఇండియన్-2' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.