దుల్కర్‌తో ప్ర‌భాస్ హీరోయిన్‌?

  • IndiaGlitz, [Friday,May 22 2020]

మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ఓకే బంగారంతో అటు త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ స‌క్సెస్ కొట్టాడు. అలాగే మ‌హాన‌టిలో జెమినీగ‌ణేశ‌న్ పాత్ర‌ధారిగా త‌న న‌ట‌న‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గర‌య్యారు. రీసెంట్‌గా కూడా త‌మిళ చిత్రం రీమేక్ క‌నులు క‌నుల‌ను దోచాయంటే సినిమా కూడా మంచి టాక్‌నే సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు సీనియ‌ర్ నిర్మాత సి.అశ్వినీద‌త్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాను డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ తోడుగా పూజాహెగ్డే న‌టించ‌నుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 20వ చిత్రంతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రంలో న‌టిస్తోంది పూజా హెగ్డే.

ఈ సినిమాలో దుల్క‌ర్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని అంటున్నారు. దుల్క‌ర్‌తో సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే దానిపై అశ్వినీద‌త్ క్లారిటీ ఇవ్వ‌లేదు కానీ.. కరోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించి మ‌రింత క్లారిటీ రానుంద‌ని టాక్‌.

More News

మేక‌ప్ లేకుండా కీర్తిసురేశ్‌.. థాంక్స్ చెప్పింది

లేటెస్ట్‌గా కీర్తి సురేశ్ పోస్ట్ చేసిన వీడియో ఒక‌టి నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కూ కీర్తి సురేశ్ పోస్ట్ చేసిన వీడియో ఏంటో తెలుసా?

ఎన్టీఆర్ లైఫ్‌‌ఫై పూనమ్ ఎందుకిలా ట్వీట్ చేసిందో!?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే-20. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

ఇండియ‌న్ 2 లొకేష‌న్ మారిందా?

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.

టెస్ట్ షూట్‌కి సిద్ధ‌మ‌వుతోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ యూనిట్‌

క‌రోనా ప్ర‌భావం నుండి సామాన్య జీవితాన్ని ప్రారంభించడానికి అంద‌రూ ప్రయ‌త్నాలు ప్రారంభిస్తున్నారు..

నేను మాస్క్ ధరించా.. మరి మీరు..? : మహేశ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం..