సురేంద‌ర్ రెడ్డితో ప్ర‌భాస్‌?

  • IndiaGlitz, [Saturday,October 12 2019]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో 'జాన్'(ప‌రిశీల‌న‌లోకి టైటిల్‌) సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆల్రెడీ సెట్స్‌లో ఉంది. త‌ర్వాత ప్ర‌భాస్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్‌. బాహుబ‌లి త‌ర్వాత విడుద‌లైన సాహో ఆశించిన మేర ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేక‌పోయిన‌ప్ప‌టికీ.. హిందీలో మాత్రం పెద్ద విజ‌యాన్నే సొంతం చేసుకుంది. దీంతో ప్ర‌భాస్ హిందీ మార్కెట్‌పై ప‌ట్టుకోల్పోలేద‌ని అర్థ‌మైంది. ఇప్పుడు జాన్ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా చిత్రంగానే చేయాల‌నుకుంటున్నారు. అయితే బ‌డ్జెట్ విష‌యంలో ప్ర‌భాస్ కేర్ తీసుకుంటున్నారు.

మ‌రి 'జాన్‌' త‌ర్వాత ప్ర‌భాస్ చేయ‌బోయే సినిమా ఏంటి? అనే దానిపై సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం.. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ సినిమా ఉంటుంద‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సురేంద‌ర్ రెడ్డి సైరాతో నేష‌న‌ల్ రేంజ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కోసం ఓ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. అన్నీ స‌వ్యంగా కుదిరితే వీరి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అస‌లు జాన్ ఇంకా సెట్స్‌లో ఉండ‌గానే ఇలాంటి వార్త‌లు రావ‌డం కామ‌న్‌గానే జ‌రుగుతాయ‌ని, ఇప్పుడు వాటి గురించి మాట్లాడ‌టం స‌మంజ‌సం కాద‌ని ఓ వ‌ర్గం అంటుంది. మ‌రి ప్ర‌భాస్ క్యాంప్ ఈ వార్త‌ల‌పై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

More News

క‌న్న‌డ‌కు వెళుతున్న తెలుగు డైరెక్ట‌ర్‌

ఊస‌ర‌వెళ్లి, కిక్‌, టెంప‌ర్ వంటి చిత్రాల‌తో స్టార్ రైట‌ర్‌గా పేరు తెచ్చుకున్న వ‌క్కంతం వంశీ ... 2018లో

అక్క‌డ ఫోక‌స్ పెట్టిన స‌మంత‌

పెళ్లికి ముందే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న స‌మంత‌.. అక్కినేని నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత స్టార్ హీరోయిన్‌గానే కాదు..

వైరల్ అవుతున్న మహేష్ బాబు స్విట్జర్లాండ్ ట్రిప్ ఫోటోలు

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌... ఏ మాత్రం ఖాళీ దొరికినా త‌న ఫ్యామిలీతో క‌లిసి విహార‌యాత్ర‌ల‌కు వెళుతుంటాడు.

చిరుతో నాకు ఎలాంటి గొడవల్లేవ్.. అంతా టీడీపీ కుట్రే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై గత రెండ్రోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్ట్‌లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

విశాల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి

త‌మిళ హీరో, న‌డిగ‌ర్‌సంఘం కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు విశాల్ సినిమాల‌కు తెలుగులోనూ మంచి ఆద‌ర‌ణ  ఉన్నాయి.