close
Choose your channels

క‌న్న‌డ‌కు వెళుతున్న తెలుగు డైరెక్ట‌ర్‌

Saturday, October 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌న్న‌డ‌కు వెళుతున్న తెలుగు డైరెక్ట‌ర్‌

ఊస‌ర‌వెళ్లి, కిక్‌, టెంప‌ర్ వంటి చిత్రాల‌తో స్టార్ రైట‌ర్‌గా పేరు తెచ్చుకున్న వ‌క్కంతం వంశీ ... 2018లో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు. బ‌న్నీ హీరోగా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫ‌స్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో వ‌క్కంతం వంశీకి డైరెక్ట‌ర్‌గా తెలుగులో అవ‌కాశాలు మాత్రం రాలేదు. వ‌క్కంతం వంశీ త‌దుప‌రి సినిమా కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేశాడు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ డైరెక్ట‌ర్ శాండిల్‌వుడ్‌లోకి అడుగుపెడుతున్నాడ‌ట‌. వివ‌రాల ప్ర‌కారం క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్‌తో వ‌క్కంతం వంశీ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. ఈ చ‌ర్చ‌లు ఇంకా కొలిక్కి రాలేద‌ట‌. వివ‌రాల ప్ర‌కారం అన్నీ అనుకున్న‌ట్లు స‌వ్యంగా జ‌రిగితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ యాక్ష‌న్ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ట‌. అయితే ఈ చ‌ర్చ‌లు తొలి ద‌శ‌లోనే ఉన్నాయంటున్నారు . తెలుగులో డైరెక్ట‌ర్‌గా స‌క్సెస్ అందుకోలేక‌పోయిన వ‌క్కంతం వంశీ మ‌రి క‌న్న‌డంలోనైనా హీరోగా పేరు తెచ్చుకుంటారేమో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.