ప్ర‌శాంత్ వ‌ర్మకి ఇబ్బంది...!

  • IndiaGlitz, [Friday,October 19 2018]

బాలీవుడ్‌లో ఘన విజ‌యాన్ని సాధించిన చిత్రం క్వీన్‌. కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్రాన్ని ద‌క్షిణాది భాష‌లన్నింటిలోనూ మ‌నుకుమార్ రీమేక్ చేస్తున్నారు. నాలుగు భాష‌ల్లో న‌లుగురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు.

కన్న‌డ, త‌మిళ వెర్ష‌న్‌ను ర‌మేష్ అర‌వింద్ డైరెక్ట్ చేస్తే.. మ‌ల‌యాళ వెర్ష‌న్‌ను నీల‌కంఠ డైరెక్ట్ చేశారు. స‌మ‌స్య వ‌చ్చింద‌ల్లా తెలుగు వెర్ష‌న్‌కే. తెలుగులో ముందు స‌గం సినిమాను నీల‌కంఠ డైరెక్ట్ చేశారు. త‌ర్వాత నీల‌కంఠ‌, త‌మ‌న్నాల‌కు ఏదో గొడ‌వ రావ‌డంతో నీల‌కంఠ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు.

ఆ స్థానంలో అ! ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే రీసెంట్‌గా నాలుగు భాష‌ల‌కు చెందిన ఫ‌స్ట్‌లుక్స్‌ను విడుద‌ల చేశారు. అందులో తెలుగు వెర్ష‌న్‌కు డైరెక్ట‌ర్ పేరు లేదు. ఇద్ద‌రు డైరెక్ట‌ర్స్ సినిమాను డైరెక్ట్ చేయ‌డంతో.. యూనిట్ ఎవ‌రికీ క్రెడిట్ ఇవ్వ‌లేదు. ఓ ర‌కంగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు ఇది ఓ ర‌కంగా ఇబ్బంది క‌ర‌మైన స‌మస్యనే చెప్పాలి.

More News

'కథనం' మోషన్ పొస్టర్ విడుదల

అనసూయ భరద్వాజ్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్న చిత్రం "కథనం". గాయత్రి ఫిలింస్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నరేందర్ రెడ్డి బట్టేపాటి

ద‌ర్శ‌కుడు బాబీ చేతుల మీదుగా రామ చ‌క్క‌ని సీత టైటిల్ లోగో విడుదల.. 

ఇంద్ర‌, సుకృత జంట‌గా క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చ‌క్క‌ని సీత‌.

నిఖిల్, నివేదా థామస్ శ్వాస మూవీ లాంచ్.. 

కుర్ర హీరో నిఖిల్, మ‌ళ‌యాల బ్యూటీ నివేదా థామ‌స్ జంట‌గా వ‌స్తోన్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ శ్వాస‌.

ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

చర‌ణ్ మూవీ టైటిల్ మార‌నుందా?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటుంది.