పూరీ 'ఫైట‌ర్‌'లో వింక్ బ్యూటీ ?

  • IndiaGlitz, [Monday,October 07 2019]

'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఘ‌న‌విజ‌యం.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌లో ఎన‌లేని ఉత్సాహాన్ని నింపింది. ఈ నేప‌థ్యంలో.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ప్లాన్ చేశాడు పూరి. 'ఫైట‌ర్‌' పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో విజ‌య్ బాక్సర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు.. మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకుంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని 2020 వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జోడీగా 'వింక్‌' బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ని ఎంపిక చేశార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ప్రియ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌ల‌యాళ అనువాద చిత్రం 'ల‌వ‌ర్స్ డే'తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ప్రియ‌.. ప్ర‌స్తుతం నితిన్ క‌థానాయ‌కుడిగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి తెర‌కెక్కిస్తున్న సినిమాలో ఓ నాయిక‌గా న‌టిస్తోంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 2020 ప్ర‌థ‌మార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రి.. 'ఫైట‌ర్‌' చిత్రంతోనైనా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ కెరీర్ మేలిమలుపు తిరుగుతుందేమో చూడాలి.