close
Choose your channels

పూరీ 'ఫైట‌ర్‌'లో వింక్ బ్యూటీ ?

Monday, October 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫైట‌ర్‌లో వింక్ బ్యూటీ ?

`ఇస్మార్ట్ శంక‌ర్‌` ఘ‌న‌విజ‌యం.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌లో ఎన‌లేని ఉత్సాహాన్ని నింపింది. ఈ నేప‌థ్యంలో.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ప్లాన్ చేశాడు పూరి. `ఫైట‌ర్‌` పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో విజ‌య్ బాక్సర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు.. మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకుంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని 2020 వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జోడీగా `వింక్‌` బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ని ఎంపిక చేశార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ప్రియ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌ల‌యాళ అనువాద చిత్రం `ల‌వ‌ర్స్ డే`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ప్రియ‌.. ప్ర‌స్తుతం నితిన్ క‌థానాయ‌కుడిగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి తెర‌కెక్కిస్తున్న సినిమాలో ఓ నాయిక‌గా న‌టిస్తోంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 2020 ప్ర‌థ‌మార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రి.. `ఫైట‌ర్‌` చిత్రంతోనైనా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ కెరీర్ మేలిమలుపు తిరుగుతుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.