close
Choose your channels

'అనుపమ చాలా డేంజ‌ర‌స్ హౌజ్ వైఫ్ రా '.. సస్పెన్స్ పెంచేస్తోన్న భామా క‌లాపం టీజర్‌

Monday, January 24, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుపమ చాలా డేంజ‌ర‌స్ హౌజ్ వైఫ్ రా .. సస్పెన్స్ పెంచేస్తోన్న భామా క‌లాపం టీజర్‌

2003లో ఎవరే అతగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రియమణి. తర్వాత 'పెళ్లైన కొత్తలో' , 'యమదొంగ', రగడ, గోలిమార్ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియమణి. పెళ్లి తర్వాత ప్రేక్షకులకు దూరమైన ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్‌లో తిరిగి సత్తా చాటుతున్నారు. ఇటీవల హిందీ వెబ్‌ సిరీస్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే కాకుండా ప్రముఖ తెలుగు రియాల్టీ డ్యాన్స్‌ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు, అభిమానులను అలరిస్తున్నారు.

అనుపమ చాలా డేంజ‌ర‌స్ హౌజ్ వైఫ్ రా .. సస్పెన్స్ పెంచేస్తోన్న భామా క‌లాపం టీజర్‌

 

ఇకపోతే .. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తూ దూసుకెళ్తోంది తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, టాక్ షోలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా.. ఇతర భాషల్లోని సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి తెలుగు వారికి వినోదాన్ని అందిస్తోంది. తాజాగా ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ప్రియమణితో ఆహా సంస్థ వినూత్న ప్రయోగం చేసింది.

అనుపమ చాలా డేంజ‌ర‌స్ హౌజ్ వైఫ్ రా .. సస్పెన్స్ పెంచేస్తోన్న భామా క‌లాపం టీజర్‌

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన భామా కలాపం అనే వెబ్ సిరీస్ ఆహాలో రాబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్ అంచనాలను పెంచేసింది. తాజాగా భామా కలాపం’ నుంచి టీజర్ విడుదల చేశారు. పక్క ఇళ్లల్లో జరిగే వ్యవహారాల మీద ఆసక్తి చూపించే అనుపమ అనే గృహిణి క్యారెక్టర్‌లో ప్రియమణి ఆకట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే అర్థ‌రాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో హ‌త్య జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్‌కి, అనుప‌మ‌కు సంబంధం ఏంటి.? దీని వ‌ల్ల ఆమె జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న క‌థాంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని ‘‘భామా కలాపాన్ని’’ తెర‌కెక్కించారు. టీజర్‌లో వచ్చే చాలా డేంజ‌ర‌స్ హౌజ్ వైఫ్ రా అనే డైలాగ్ ప్రియ‌మ‌ణి పాత్రపై మ‌రింత ఆసక్తిని పెంచేసింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఫిబ్రవరి 11 నుండి ‘ఆహా’ లో ‘భామా కలాపం’ స్ట్రీమింగ్ కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.