3 షోలతో అంటే కష్టం.. చైతు, సాయి పల్లవి 'లవ్ స్టోరీ'పై నిర్మాత!

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. సెన్సిబుల్ చిత్రాలతో మ్యాజిక్ చేసే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలై పోవాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ కాలేదు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుష్కర్ రాంమ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తాజాగా లవ్ స్టోరీ రిలీజ్ పై నారాయణ్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల విడుదలకు అనుమతి ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు.

నైట్ కర్ఫ్యూ ఉంటే రోజుకు మూడు ఆటలు మాత్రమే సాధ్యమవుతాయి. కేవలం మూడు షోలతో థియేటర్స్ నడుస్తుంటే ఏ నిర్మాత కూడా తమ చిత్రాలని రిలీజ్ చేయరు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. నైట్ కర్ఫ్యూని పూర్తిగా ఎత్తివేసిన తర్వాతే సినిమాల విడుదల సాధ్యం అవుతుంది.

జూలై రెండవ వారానికి పరిస్థితులు చక్కబడే అవకాశం ఉందని అంటున్నారు. తాము కూడా 'లవ్ స్టోరీ' చిత్రాన్ని నైట్ కర్ఫ్యూ ఎత్తేసిన వారం తర్వాత రిలీజ్ చేస్తాం అని నారాయణ్ దాస్ అభిప్రాయపడ్డారు.

చైతు, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన 'సారంగ దారియా' సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి సిహెచ్ పవన్ సంగీత దర్శకుడు.

More News

100 మిలియన్ల 'ఎల్లువొచ్చి గోదారమ్మ'.. పూజా హెగ్డే రెస్పాన్స్ చూశారా.. 

అప్పటి వరకు క్లాస్ గా కనిపించిన వరుణ్ తేజ్ ని మాస్ లుక్ లోకి మార్చేసిన చిత్రం 'గద్దలకొండ గణేష్'.

వికటించిన కరోనా వ్యాక్సిన్.. దేశంలో తొలి మరణం!

దేశం నలువైపులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ధాటిని తట్టుకునేందుకు అనేక వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి.

బుర్రకథ హీరోయిన్ అరెస్ట్.. స్నేహితుడితో కలసి గంజాయి తీసుకుంటూ..

యంగ్ హీరోయిన్ నైరా షాని నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ సంఘటన జరిగింది.

నితిన్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి డెబ్యూ డైరెక్టర్ తో..

యూత్ స్టార్ నితిన్ వరుస చిత్రాలని చకచకా పూర్తి చేస్తున్నాడు. నితిన్ ఇప్పటికే ఈ ఏడాది రెండు చిత్రాలని రిలీజ్ చేశాడు.

కోవిడ్ తగ్గాక కీళ్ల నొప్పులు అందుకే.. టీకా, థర్డ్ వేవ్ గురించి ప్రముఖ ఆర్థోపెడిక్..

కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ కీళ్లు, కండరాలకు సంబంధించిన నొప్పులు వస్తున్నాయి.