ఆస్కార్ మూవీకి కోర్టు నోటీసులివ్వాలంనుకుంటున్న నిర్మాత‌

  • IndiaGlitz, [Sunday,February 16 2020]

రీసెంట్‌గా అనౌన్స్ చేసిన ఆస్కార్ అవార్డ్స్‌లో ద‌క్షిణ కొరియా చిత్రం 'పార‌సైట్‌'కు ఏకంగా నాలుగు అవార్డులు ద‌క్కాయి. ఉత్త‌మ‌చిత్రం, డైరెక్ట‌ర్‌, విదేశీచిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఈ చిత్రం అవార్డుల ద‌క్కించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో ఈ సినిమా క‌థాంశం గురించి పెద్ద చ‌ర్చే జ‌రిగింది. అయితే కొంత మంది మాత్రం ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావ‌డంపై పెద‌వి విరిచారు. కోలీవుడ్ సినీ అభిమానులైతే పార‌సైట్ సినిమా కాన్సెప్ట్ త‌మిళ చిత్రానిదేన‌ని అంటున్నారు.

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ కెరీర్ ప్రారంభంలో 'మిన్‌సార క‌న్నా' అనే సినిమాలో న‌టించాడు. ఈ చిత్రాన్ని కె.ఎస్‌.ర‌వికుమార్ తెర‌కెక్కించాడు. ఈ సినిమా నిర్మాత తేనప్ప‌న్ ఇప్పుడు 'పార‌సైట్' సినిమాపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ని, ఓ ఇంటర్నేష‌న‌ల్ న్యాయ‌వాదితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఓ ఆస్కార్ సినిమాకు కాపీ సినిమా అనే ఆరోప‌ణ‌లు రావ‌డం శోచ‌నీయం. అయితే మ‌రి ఈ కాపీ ఆరోప‌ణ‌లు ఎంత వ‌ర‌కు వెళ‌తాయో చూడాలి. పార‌సైట్ చిత్రాన్ని బొంగ్ జున్ హో తెర‌కెక్కించాడు. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ విదేశీ చిత్రంగా ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రంగా పార‌సైట్ రికార్డ్‌కెక్కింది.

More News

చ‌ర‌ణ్‌పై బ‌న్నీ ఫ్యాన్స్ గుస్సా?

మెగాస్టార్ చిరంజీవి స‌పోర్ట్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు డ‌జ‌ను హీరోలు ఆ ఫ్యామిలీ నుండి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఓక సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తిచేసుకున్న 'రావ‌ణ‌ లంక‌'

ఒక సినిమా ప్రేక్ష‌కుల ద‌గ్గ‌రికి తీసుకువెళ్లాలంటే దానికి టైటిల్ ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ప్రేక్ష‌కుల నానుడిగా వుండే టైటిల్స్ ఎప్పూడూ ఇట్టే ఆక‌ట్టుకుంటాయి.

ఇండియన్ బోల్ట్‌కు కోచింగ్ ఇప్పిస్తాం..!

జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ట్రాక్ రికార్డ్‌ను కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి బ్రేక్ చేశాడు.

మార్చి 6న 'ఓ పిట్ట క‌థ'

అగ్ర నిర్మాణ సంస్థ  భవ్య క్రియేషన్స్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు.

ఫిబ్రవరి 28న ‘కనులు కనులను దోచాయంటే’

‘కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దాని అర్థం’ – మణిరత్నం దర్శకత్వం వహించిన ‘దొంగ దొంగ’లో హిట్‌ సాంగ్‌ ఇది!