సెప్టెంబర్ రెండో వారంలో ప్రాజెక్ట్ Z విడుదల

  • IndiaGlitz, [Thursday,August 24 2017]

ఎస్‌.కె. అబ్దుల్లా సమర్పణలో ఎస్‌.బి.కె ఫిల్మ్‌ కార్పోరేషన్‌ నిర్మిస్తోన్న చిత్రం ప్రాజెక్ట్‌ Z. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సి.వి.కుమార్‌. నిర్మాతలు ఎస్‌.కె. బషీద్‌, ఎస్‌.కె. కరిమున్నీసా. ఈ చిత్రం సెప్టెంబర్‌ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎస్‌.కె. బషీద్‌ చిత్ర విశేషాలను మీడియాకి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. మా ఈ ప్రాజెక్ట్‌ జెడ్‌ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

U/A సర్టిఫికెట్‌ని సెన్సార్‌ సభ్యులు ఇచ్చారు. చిత్రం చాలా బాగా వచ్చింది. సందీప్‌కిషన్‌ ఈ చిత్రంలో డిఫరెంట్‌ రోల్‌లో నటించాడు. అతడి కెరీర్‌లో ఈ చిత్రం పెద్ద హిట్‌ చిత్రంగా నిలబడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ చిత్రం కాన్సెఫ్ట్‌ అంత కొత్తగా ఉంటుంది. జిబ్రాన్‌ చాలా మంచి మ్యూజిక్‌ని ఇచ్చాడు. ప్రేక్షకులు డిజప్పాయింట్‌ అయ్యే మూవీ మాత్రం కాదని పక్కాగా చెబుతున్నా. రాబోయే పది సంవత్సరాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేదే ఈ చిత్ర కథ. సెన్సార్‌ వాళ్ళు కూడా ఈ చిత్రం చాలా బాగుందని టీమ్‌ని మెచ్చుకున్నారు. త్వరలో ఆడియో ఫంక్షన్‌ని నిర్వహించి, సెప్టెంబర్‌ రెండోవారంలో చిత్రాన్ని ప్రేక్షుల ముందుకు తీసుకువస్తాము. ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలు మా బ్యానర్‌లో రెడీ అవుతున్నాయి. మా ఈ ప్రాజెక్ట్‌ Z విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.

More News

రెగ్యులర్ చిత్రీకరణలో తొంగి తొంగి చూడమాకు చందమామ...

దిలీప్,శ్రావణి,రాజ్ బాల,అపర్న,బేబీ అక్షర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తొంగి తొంగి చూడమాకు చందమామ.

త్రివిక్రమ్ లిస్ట్ లో మరో హీరోయిన్?

మాటల మాంత్రికుడు,ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హీరోలతోనూ,

రెండు రోజుల గ్యాప్ లో.. థమన్ అదరగొట్టాడు

రొటీన్ ట్యూన్స్ తో యువ సంగీత దర్శకుడు థమన్ రేసులో కాస్త వెనుకబడ్డాడన్నది వాస్తవం.

సినీరాజకీయ సమక్షంలో 'ప్రేమిక' పాటల విడుదల

ఎస్ వి ఎన్ రావు సమర్పణలో దేశాల ఆర్ట్ మూవీస్ పతాకంపై, స్టార్ లైన్ మూవీస్ నిర్మాణం లో

ఈసారి హిట్ కొట్టేలా ఉంది

పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పొందినట్లే పొంది..