close
Choose your channels

ఈసారి హిట్ కొట్టేలా ఉంది

Thursday, August 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాన్ని పొందిన‌ట్లే పొంది.. చివరి నిమిషంలో మిస్స‌య్యింది అనీషా అంబ్రోస్‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ కోసం హీరోయిన్‌గా ఎంపికై.. చాలా కాలం వార్త‌ల్లో నిలిచిన అనీషా.. ఆ అవకాశాన్ని మిస్ అయిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎటొచ్చి ఈ ముద్దుగుమ్మ న‌టించిన ఏ తెలుగు చిత్రం కూడా ఆమెకి స‌క్సెస్ ఇవ్వ‌లేద‌న్న‌ది వాస్త‌వం. అలియాస్ జాన‌కి, ర‌న్‌, మ‌నమంతా, ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్‌.. ఇలా అనీషా హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ప్ర‌తి సినిమా ఫ్లాప్ అయింది. వీటిలో మన‌మంతాకి ప్ర‌శంస‌లైతే ల‌భించాయి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు చిత్రాల్లో న‌టిస్తోంది.

ఆ చిత్రాలే ఒక్క‌డు మిగిలాడు, విఠ‌లాచార్య‌. మంచు మ‌నోజ్ హీరోగా న‌టించిన ఒక్క‌డు మిగిలాడు ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజై అందులోని కంటెంట్‌తో అంద‌ర్నీ అల‌రిస్తోంది. ట్రైల‌ర్ లాగే సినిమా కూడా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితే అనీషా ఎదురుచూస్తున్న విజ‌యం ఆమె చెంత‌కు చేరిన‌ట్టే. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అన్న‌ట్టు.. అనీషా రెండు క‌న్న‌డ చిత్రాలు కూడా చేసింది. అయితే అవి కూడా ఆమె కెరీర్‌కి అంత‌గా ప్ల‌స్ అవ‌లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.