బాలీవుడ్ లో పూరి ఇజం..!

  • IndiaGlitz, [Wednesday,October 26 2016]

డేరింగ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన ఇజం ఇటీవ‌ల రిలీజై స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఇజం రిలీజ్ త‌ర్వాతే పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తో పూరి సినిమా ఉందో లేదో అనేది ఇజం త‌ర్వాతే తెలుస్తుంది అని ప్ర‌చారం జ‌రిగింది.
ఇజం సినిమా రిలీజైంది కానీ...ఎన్టీఆర్ - పూరి సినిమా గురించి క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే...ఇజం చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు స‌ల్మాన్ ఖాన్ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం పూరి ముంబాయిలో ఉన్నారు. స‌ల్మాన్ తో ఇజం రీమేక్ గురించి మాట్లాడేందుకే పూరి ముంబాయి వెళ్లార‌ని తెలిసింది. గ‌తంలో స‌ల్మాన్ ఖాన్ పూరి తెర‌కెక్కించిన బ్లాక్ బ‌ష్ట‌ర్ పోకిరి చిత్రాన్ని బాలీవుడ్ లో వాంటెడ్ టైటిల్ తో రీమేక్ చేసారు. మ‌రి...ఇప్పుడు ఇజం చిత్రాన్ని కూడా స‌ల్మాన్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తాడేమో..!

More News

రాజ్ తరుణ్, వెలిగొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'అంధగాడు' ప్రారంభం

కుమారి 21ఎఫ్,ఈడోరకం-ఆడోరకం వంటి విజయవంతమైన చిత్రాలతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్,

దిల్ రాజు ను మెప్పించిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్

రావు రమేష్,హెబ్బా పటేల్,తేజస్వి,అశ్విన్,పార్వతీశం,నోయల్ సెన్ ప్రధాన పాత్రల్లో భాస్కర్ బండి తెరకెక్కించిన చిత్రం నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్.

ఆ వార్తల్లో నిజం లేదంటున్న సమంత..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనుంది.

మెట్టమెదటి సారిగా బి.బి.సి ఎసియన్ నెట్ వర్క్ లో 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి' సాంగ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'భాహుబలి' చిత్రంతో కాళకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన చిత్రం 'ఆవు పులి మద్యలో ప్రభాస్ పెళ్ళి'..

మరో రీమేక్ లో సునీల్...?

అందాల రాముడుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ సునీల్ మర్యాద రామన్న,పూలరంగడు చిత్రాలతో హీరోగా మారాడు.