'పైసా వసూల్ ' తర్వాత పూరి సినిమా అదే!

  • IndiaGlitz, [Thursday,June 29 2017]

విభిన్న కథలకు, విభిన్న చిత్రాలకు పూరి జగన్నాథ్‌ పెట్టింది పేరు. అతని సినిమాల్లో హీరోల పాత్ర చిత్రణ విచిత్రంగా వుంటుంది. హీరో బాడీ లాంగ్వేజ్‌, అతను చెప్పే డైలాగ్స్‌ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా వుంటాయి. అప్పటివరకు ఎలాంటి ఇమేజ్‌ వున్నా పూరి సినిమా చేసిన తర్వాత ఆ హీరో ఇమేజ్‌లో మార్పు వస్తుంది. ప్రతి హీరో పూరితో సినిమా చెయ్యాలని అనుకుంటారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ను పూరి దర్శకత్వంలో వచ్చిన 'చిరుత' చిత్రంతో హీరోగా పరిచయం చేశారంటే హీరోల్లో పూరికి ఫాలోయింగ్‌ ఏమిటి అనేది అర్థమవుతుంది. తన తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ను '143' చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు.

కన్నడ హీరో ఇషాన్‌ను 'రోగ్‌' చిత్రంతో హీరోని చేశాడు. ఇప్పుడు పూరి తనయుడు ఆకాష్‌ వంతు వచ్చింది. అంతకుముందు 'ఆంధ్రాపోరి' అనే సినిమాలో హీరోగా నటించాడు ఆకాష్‌. ఇప్పుడు ఆకాష్‌ను పూర్తి స్థాయి హీరోగా పరిచయం చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు పూరి. అతని కోసం ఒక అద్భుతమైన సబ్జెక్ట్‌ని రెడీ చేశాడు. నటనతోపాటు ఇతర అంశాల్లో కూడా శిక్షణ తీసుకంటున్నాడు ఆకాష్‌. థాయ్‌లాండ్‌లో 45 రోజులు మువైథాయి అనే స్పోర్ట్స్‌ కోర్సును చేశాడు. వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక ఆహార నియమాలతో 8 కిలోల బరువు తగ్గించుకోగలిగాడు. ప్రస్తుతం నటనకు సంబంధించి న్యూయార్క్‌లో శిక్షణ పొందుతున్నాడు ఆకాష్‌. నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ చేస్తున్న 'పైసా వసూల్‌' తర్వాత ఆకాష్‌తో చేసే సినిమా ప్రారంభమవుతుంది.

More News

రాందేవ్ బాబాగా అజయ్ దేవ్ గన్

భారతీయ సినిమాల్లో బయోపిక్ లకు ప్రాధాన్యత ఈమధ్యకాలంలో బాగా పెరిగింది.

ద్విభాషా చిత్రంలో తొలిసారి....

కన్నడలో 'అధ్యక్షా'చిత్రంతో పరిచయమైన హెబా పటేల్ ఆ తర్వాత ఓ తమిళ సినిమా కూడా చేసింది.

33 ఏళ్ల సినీ ప్రస్థానంలో దర్శకుడు శ్రీనివాస రెడ్డి

కామెడీ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు ఎస్.శ్రీనివాస రెడ్డి

పృథ్వీకి కోర్టులో చుక్కెదురు...

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ చిన్న చిన్న వేషాలు వేసిన కమెడియన్ పృథ్వీ ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ కమెడియన్గా మారారు. వ్యక్తిగత విషయానికి వస్తే పృథ్వీ తన భార్య శ్రీలక్ష్మితో వచ్చిన విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నాడు.

ఒకపాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకొన్న మంచు విష్ణు 'ఓటర్'

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ "ఓటర్". "హీరో ఆఫ్ ది నేషన్" అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.