close
Choose your channels

రాందేవ్ బాబాగా అజయ్ దేవ్ గన్

Thursday, June 29, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భారతీయ సినిమాల్లో బయోపిక్‌లకు ప్రాధాన్యత ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. క్రీడాకారులు, సినిమా తారలు, రాజకీయ నాయకులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథలను తీసుకొని సినిమాలుగా రూపొందించేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటివారి జాబితాలో ఇప్పుడు యోగా గురు రాందేవ్‌ బాబా కూడా చేరారు.

రాందేవ్‌ బాబా బయోపిక్‌ను నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాందేవ్‌ బాబా క్యారెక్టర్‌ను ప్రముఖ బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ పోషించనున్నట్టు తెలుస్తోంది. తొలుత రాందేవ్‌ బాబా జీవిత చరిత్రను ఓ టివి షోగా నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన పాత్ర కోసం టి.వి. నటుడు విక్రాంత్‌ మస్సేను ఎంపిక చేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ షో నుంచి విక్రాంత్‌ మస్సే తప్పుకున్నాడు. దాంతో టి.వి. షో చెయ్యాలన్న ఆలోచనను కూడా విరమించుకున్నారు.

ఇప్పుడు పూర్తి స్థాయిలో రాందేవ్‌ బాబా జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాందేవ్‌ బాబా రాజకీయ సంబంధాలు, పతంజలి వంటి అంశాలతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అజయ్‌ దేవ్‌గన్‌ 'గోల్‌మాల్‌ ఎగైన్‌', 'బ్యాటిల్‌ ఆఫ్‌ సారాగర్హి' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రాల తర్వాత రాందేవ్‌ బాబా బయోపిక్‌ని ప్రారంభిస్తారని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.