close
Choose your channels

చిరుని ట్రాక్‌లో పెడుతున్న పూరి

Friday, April 3, 2020 • తెలుగు Comments

చిరుని ట్రాక్‌లో పెడుతున్న పూరి

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌..కరోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇంటికే ప‌రిమిత‌మైయ్యాడు. రెండు, మూడు సంద‌ర్భాల్లో ఇంటిలో ఉండాలంటూ లేక‌పోతే మ‌రింత క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ ఆయ‌న వీడియోల‌ను కూడా విడుద‌ల చేశారు. ఇవి కాకుండా పూరి ఏం చేస్తున్నాడ‌నే సందేహం రాక మాన‌దు. దాదాపు 21 రోజుల స‌మ‌యాన్ని పూరి .. క‌థ‌ను రాసుకోవ‌డానికి వెచ్చిస్తున్నాడ‌ట‌. ఓ స్టార్ హీరో కోసం పూరి క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు..మెగాస్టార్ చిరంజీవి అని స‌మాచారం.

నిజానికి చిరంజీవి రీ ఎంట్రీ సినిమాను పూరినే డైరెక్ట్ చేయాల్సింది. ఆటోజానీ పేరుతో క‌థ‌ను పూరి సిద్ధం చేశాడు కూడా. అయితే చిరంజీవి సెకండాఫ్ న‌చ్చ‌క‌పోవ‌డంతో సినిమా నుండి డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు చిరుతో మ‌రోసారి సినిమాను తెర‌కెక్కించాల‌ని పూరి గ‌ట్టిగానే అనుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చిరు, కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత లూసిఫ‌ర్ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే పూరి క‌థ న‌చ్చితే.. చిరు సినిమాను ట్రాక్ ఎక్కించే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు. మ‌రి ఈసారైనా చిరు, పూరి క్రేజీ కాంబోలో సినిమా రూపొందుతుందా? అని చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz