close
Choose your channels

PV Ramesh:ఎల్లో మీడియా ట్రాప్‌లో పీవీ రమేష్.. అడ్డంగా దొరికిపోయి దిద్దుబాటు చర్యలు..

Monday, May 6, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకు పచ్చ మీడియా కూడా తోడైంది. ప్రజలను భయపెట్టేలా కథనాలు ప్రచురిస్తూ రాక్షసానందం పొందుతోంది. ఇప్పుడు చంద్రబాబు కుట్రలోకి మాజీ ఐఏఎస్ అధికారులు కూడా కలిసి వస్తున్నారు. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ ఈ జాబితాలో చేరారు. అయితే అడ్డంగా దొరికపోయారు. తొలుత తాను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడిని అంటూ ఓ ట్వీట్ చేశారు.

''నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని.. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. IAS అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం''అంటూ అందులో పేర్కొన్నారు.

దీంతో తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా ఆ ట్వీట్‌ను వైరల్ చేస్తూ గగ్గోలు పెట్టాయి. సాక్షాత్తూ మాజీ ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉందంటూ కథనాలు ప్రసారం చేశాయి. అయితే ఇంతలో ఎవరైనా ప్రశ్నించారో.. లేక తాను చెప్పింది అబద్ధం అని తెలిసిందో.. వెంటనే ఆ ట్వీట్‌ను ఎడిట్ చేసేశారు. ''చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి'' అంటూ ఓ లైన్ యాడ్ చేశారు. అంటే ఇంకా చట్టం అమల్లోకి రాలేదని పీవీ రమేష్ చెబుతున్నారు. మరి అమలులో లేని చట్టానికి ఆయన ప్రత్యక్ష బాధితుడిగా ఎలా మారారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.