త‌మిళ్ లో సెకండ్ మూవీకి సైన్ చేసిన రాశీ

  • IndiaGlitz, [Thursday,September 29 2016]

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న అందాల క‌థానాయిక రాశీ ఖ‌న్నా. ఆత‌ర్వాత జోరు, జిల్, శివ‌మ్, బెంగాల్ టైగ‌ర్, సుప్రీమ్ చిత్రాల్లో న‌టించి మెప్పించింది. తాజాగా హైప‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న రాశీ ఖ‌న్నా త‌మిళ్ కూడా రాణిస్తుంది. తమిళ్ లో రాశీ ఖ‌న్నా తొలి ప్ర‌య‌త్నంగా సైతాన్ కా బ‌చ్చా చిత్రంలో సిద్దార్ధ స‌ర‌స‌న న‌టిస్తుంది. తాజాగా త‌మిళ్ లో సెకండ్ మూవీకి సైన్ చేసింది. డిమోన్టీ కాల‌నీ చిత్రాన్ని తెర‌కెక్కించిన ఆర్.అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రంలో న‌టించేందుకు రాశీ అంగీక‌రించింది. ఈ చిత్రంలో హిట్ హీరో అధ‌ర్వ స‌ర‌స‌న న‌టిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానుంది.

More News

ప‌వ‌న్ - ఎ.ఎం.ర‌త్నం మూవీ డీటైల్స్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్  మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు.

ప‌వ‌న్ చెల్లెలు త‌ల్ల‌య్యింది

ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చెల్లెలుగా అన్న‌వ‌రం సినిమాలో న‌టించిన సంధ్య అందిరికీ గుర్తుండే ఉంటుంది. కాద‌ల్ చిత్రంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన ఈ న‌టి తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో కూడా ప‌లు చిత్రాల్లో న‌టించింది.

శాత‌క‌ర్ణి సీడెడ్ హ‌క్కులు ఎవ‌రివంటే

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్‌ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ‌హేష్‌ను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్ర‌మ్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటేనే క్రేజీ...వీరి కాంబినేష‌న్ లో గ‌తంలో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు విడుద‌ల‌య్యాయి. త్రివిక్ర‌మ్ డైలాగ్ ను మ‌హేష్ చెప్పే మాడ్యులేష‌న్ లెక్క ప‌రిగా ఉంటుంది కాబ‌ట్టే ఈ కాంబినేష‌న్‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌పై తీసుకురావడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

మెగాస్టార్ ప్రొమో వ‌చ్చేసింది..!

మెగాస్టార్ ప్రొమో వ‌చ్చేసింది అన‌గానే ఖైదీ నెం 150 లేటెస్ట్ ప్రొమో వ‌చ్చింది అనుకుంటే పొర‌పాటే..! అస‌లు విష‌యం ఏమిటంటే...బుల్లితెర పై కింగ్ నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు  కార్య‌క్ర‌మాని వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.