నితిన్ జోడీగా రాశి ఖ‌న్నా?

  • IndiaGlitz, [Friday,February 16 2018]

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'తొలి ప్రేమ' సినిమా విజ‌యంతో మ‌రోసారి ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డింది ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ సినిమాలో వ‌ర్ష పాత్ర‌లో యువ‌త‌రాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ని..తాజాగా ఓ మంచి అవ‌కాశం వ‌రించింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

నితిన్ క‌థానాయ‌కుడిగా 'శ్రీనివాస క‌ల్యాణం' పేరుతో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. 'శ‌త‌మానం భ‌వ‌తి' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌తీష్ వేగేశ్న ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా రాశి ఖ‌న్నా ఎంపికైంద‌ని తెలిసింది.

ఇంత‌కుముందు ఈ పాత్ర కోసం పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్నా పేర్లు వినిపించినా.. 'తొలి ప్రేమ‌'లో రాశి న‌ట‌న న‌చ్చ‌డంతో ఆమె వైపే చిత్ర బృందం ఆస‌క్తి చూపింద‌ని స‌మాచారం. ఇందులో రెండో హీరోయిన్‌గా నందితా శ్వేత న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే రాశి ఎంపిక‌పై క్లారిటీ వ‌స్తుంది.

More News

వరుణ్ మెగా కుటుంబం గర్వపడే సినిమా చేశాడు: మెగాస్టార్ చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన 'తొలిప్రేమ'

'చెన్నై చిన్నోడు' ఆడియో లాంచ్

జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూ సంగీతాన్ని సమకూర్చిన ఓ తమిళ చిత్రాన్ని 'చెన్నైచిన్నోడు'

సుమంత్ కొత్త సినిమా టైటిల్

చాలా కాలం గ్యాప్ తర్వాత 'మళ్ళీరావా' సినిమాతో విజయాన్ని అందుకున్నారు సుమంత్.

దర్శకుడికి నాగశౌర్య ఖరీదైన కానుక

ఆనందాన్ని పది మందితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుందంటారు.

పవన్ కళ్యాణ్ తో యోగేంద్ర యాదవ్ , చలసాని శ్రీనివాసరావు భేటీ

స్వరాజ్ అభియాన్ నేత,అమ్ ఆద్మీ మాజీ కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ యోగేందర్ యాదవ్ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ను గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు.