close
Choose your channels

నితిన్ జోడీగా రాశి ఖ‌న్నా?

Friday, February 16, 2018 • తెలుగు Comments

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'తొలి ప్రేమ' సినిమా విజ‌యంతో మ‌రోసారి ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డింది ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ సినిమాలో వ‌ర్ష పాత్ర‌లో యువ‌త‌రాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ని..తాజాగా ఓ మంచి అవ‌కాశం వ‌రించింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

నితిన్ క‌థానాయ‌కుడిగా 'శ్రీనివాస క‌ల్యాణం' పేరుతో దిల్ రాజు  ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. 'శ‌త‌మానం భ‌వ‌తి' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌తీష్ వేగేశ్న ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా రాశి ఖ‌న్నా ఎంపికైంద‌ని తెలిసింది.

ఇంత‌కుముందు ఈ పాత్ర కోసం పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్నా పేర్లు వినిపించినా.. 'తొలి ప్రేమ‌'లో రాశి న‌ట‌న న‌చ్చ‌డంతో ఆమె వైపే చిత్ర బృందం ఆస‌క్తి చూపింద‌ని స‌మాచారం. ఇందులో రెండో హీరోయిన్‌గా నందితా శ్వేత న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే రాశి ఎంపిక‌పై క్లారిటీ వ‌స్తుంది.