ఈనెల 29న విడుదలౌతున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ రహదారి

  • IndiaGlitz, [Monday,April 18 2016]
సేతు, అభిషేక్, రాజ్, పూజ, ఉమాశంకర్, శ్వేత, విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం రహదారి. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారిస్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సురేష్ కుమార్ మరియు రాజ్ డైరెక్టర్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ రాజ్ అద్భుతమైన సంగీతమందించారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేగా ఈ చిత్రాన్ని మలిచారు. అనిల్ అరసు యాక్షన్ ఎపిసోడ్స్ అబ్బుర పరుస్తాయని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. కిషోర్ మణి అద్భుతమైన విజువల్స్ తో కథకు రిచ్ నెస్ తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.... యాక్షన్ థ్రిల్లర్ తరహా కథలకు మన దగ్గర డిమాండ్ ఎక్కువ. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాల్ని ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా రహదారి పేరుతో మేం రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఈనెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాహుల్ రాజ్ అద్భుతమైన పాటలందించారు. ప్రతీ పాటకు చిత్రంలో ఇంపార్టెన్స్ ఉంటుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లేను అద్భుతంగా మలిచారు. అనిల్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. అని అన్నారు.
డిఓపి - కిషోర్ మణి మ్యూజిక్ - రాహుల్ రాజ్ ఎడిటర్ - విటి విజయన్ యాక్షన్ - అనిల్ అరసు నిర్మాత - రాజ్ జకారిస్ డైరెక్టర్స్ - సురేష్ కుమార్ మరియు రాజ్

More News

పవన్ ప్రజెంట్ టార్గెట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని...రాజకీయాల్లో ప్రవేశించాకా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాను అని ప్రకటించారు.

శ్రీమాన్‌ దర్శకుడిగా కన్నడలో 'కుమారి 21ఎఫ్‌'

రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మించిన చిత్రం  'కుమారి 21ఎఫ్‌. ఈ చిత్రం' తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

అమ్మకు అఖిల్ అభినంద‌న‌

అమ్మ అమ‌ల‌కు అఖిల్ అభినంద‌న‌లు తెలియ‌చేసారు. ఇంత‌కీ ఎందుకు అభినందించాడంటే...నాగార్జున స‌హ‌కారంతో అమ‌ల బ్లాక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని సంవ‌త్స‌రాలుగా  జంతువులను సంర‌క్షిస్తూ ఎంతో సేవ చేస్తున్న విష‌యం తెలిసిందే.

మే 6న వ‌స్తున్న స్పెష‌ల్ ఫిల్మ్ 24 అంద‌రికీ న‌చ్చుతుంది - సూర్య‌

సూర్య హీరోగా న‌టిస్తూ..నిర్మించిన చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై  24 మూవీని తెలుగు, త‌మిళ్ లో సూర్య నిర్మించ‌డం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన 24 మూవీని మే 6న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు

పూరి పై దాడి చేసాం అనేది అవాస్త‌వం - లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్

లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్ అభిషేక్, ముత్యాల రాందాసు, సుధీర్...త‌న పై దాడి చేసార‌ని డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం...పోలీసులు డిస్ట్రిబ్యూట‌ర్స్ పై కేసు న‌మోదు చేయ‌డం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న గురించి డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫిలిం ఛాంబ‌ర్ లో మీడియా మీట్ ఏర్పాటు చేసారు.