close
Choose your channels

మే 6న వ‌స్తున్న స్పెష‌ల్ ఫిల్మ్ 24 అంద‌రికీ న‌చ్చుతుంది - సూర్య‌

Monday, April 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య హీరోగా న‌టిస్తూ..నిర్మించిన చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై 24 మూవీని తెలుగు, త‌మిళ్ లో సూర్య నిర్మించ‌డం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన 24 మూవీని మే 6న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో జ్ఞాన‌వేల్ రాజా మాట్లాడుతూ...విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన మ‌నం సినిమా చూసిన త‌ర్వాత మా నాన్న‌గారితో మాట్లాడాల‌నిపించింది. వెంట‌నే నాన్న‌గార్కి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పుడు మ‌నం సినిమా చూసిన త‌ర్వాత మీతో మాట్లాడాల‌నిపించింది అని చెప్పాను. ఆత‌ర్వాత మా నాన్న‌గారు కూడా మ‌నం సినిమా చూసారు. ఆత‌ర్వాత మానాన్న‌గారు డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కి ఫోన్ చేసి అభినందించి...మ‌నం సినిమాని సూర్య‌, కార్తీ ల‌తో చేయ‌మ‌న్నారు. అప్పుడు విక్ర‌మ్ కుమార్ ఓ కొత్త క‌థ ఉంది. అది న‌చ్చ‌క‌పోతే మీర‌డిగిన‌ట్టు మ‌నం సినిమా చేస్తా అన్నారు. అప్పుడు హీరో సూర్య తో విక్ర‌మ్ కుమార్ కి ఓ అర‌గంట మీటింగ్ ఏర్పాటు చేస్తే...నాలుగున్న‌ర గంట‌ల సేపు క‌థ చెప్పారు. అదే 24. అర‌గంట టైమ్ ఇచ్చిన సూర్య నాలుగున్న‌ర గంట‌లు క‌థ విన్నారంటే ఎంత బాగా న‌చ్చుంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు.ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ఈ సినిమా కోసం కెమెరామెన్ తిరు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెహ‌మాన్, డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్...ఇలా టీమ్ అంతా చాలా హార్డ్ వ‌ర్క్ చేసారు. సూర్య కెరీర్ లోనే 24 బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. మే 6న 24 మూవీని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

ర‌చ‌యిత శ‌శాంక్ వెన్నెల‌కంటి మాట్లాడుతూ...కొంత మందికి కొన్ని విష‌యాల్లో మాత్ర‌మే కొత్త ఐడియాలు వ‌స్తాయి. కానీ..రొమాన్స్, యాక్ష‌న్, కామెడీ..ఇలా అన్నింటిలో కొత్త ఐడియాస్ ఉన్న‌ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్. 13 బి, మ‌నం సినిమాల క‌థ‌లు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నాలుగున్న‌ర గంట‌లు చెప్పిన క‌థ‌ను రెండు గంట‌ల్లో తెర‌పై చూపించాలంటే చాలా క‌ష్టం. కొత్త‌క‌థ‌తో వ‌స్తున్న ఈ సినిమాకి నేను వ‌ర్క్ చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఈ సినిమాలో హీరో - విల‌న్ రెండూ సూర్య‌నే. రోబో సినిమాలో హీరో - విల‌న్ రెండు పాత్ర‌లు ర‌జ‌నీకాంత్ పోషించారు. ఇలా హీరో విల‌న్ రెండు పాత్ర‌లు చేయ‌డం చాలా క‌ష్టం. ఈ సినిమాకి రెహ‌మాన్ సంగీతం ప్ల‌స్. ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేస్తుంది అన్నారు.

డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ మాట్లాడుతూ..ఈ క‌థను ఓకే చేయ‌డంతో పాటు సూర్య‌నే నిర్మించ‌డంతో 24 నేను అనుకున్న దానికంటే పెద్ద సినిమా అయ్యింది. సూర్య మూడు డిఫ‌రెంట్ రోల్స్ చేసినా 5 డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తారు. ఆత్రేయ క్యారెక్ట‌ర్ లో సూర్య ఎంత బాగా న‌టించాడో మాట‌ల్లో చెప్ప‌లేను. అలాగే స‌మంత‌, నిత్యామీన‌న్ అద్భుతంగా న‌టించారు. గ‌తంలో వీళ్లిద్ద‌రితో వ‌ర్క్ చేసాను. భ‌విష్య‌త్ లో కూడా వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నాను. రెహ‌మాన్ గారితో వ‌ర్క్ చేయ‌డం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. పాట‌లు ఇప్ప‌టికే హిట్ అయ్యాయి.రి రీకార్డింగ్ ఎక్స్ ట్రార్డిన‌రీగా వ‌స్తుంది. టాలెంట్డ్ టీమ్ ఉండ‌డం వ‌ల‌నే మంచి చిత్రాల‌ను అందించ‌గ‌లుగుతున్నాను అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ...24 మూవీ కోసం వ‌ర్క్ చేయ‌డం వండ‌ర్ ఫుల్ జ‌ర్నీ. తెలుగులో శంక‌రాభ‌ర‌ణం, ఈగ‌, బాహుబ‌లి..ఇలా రొటీన్ కి భిన్నంగా కొత్త సినిమాలు ఎన్నో వ‌చ్చాయి. మంచి సినిమా ఎప్పుడు వ‌చ్చినా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. మ‌నం త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన స్పెష‌ల్ ఫిల్మ్ 24. ఈ సినిమా కోసం దాదాపు 100 రోజులు వ‌ర్క్ చేసాం కానీ ఎప్పుడు కూడా టెన్ష‌న్ అనేది లేదు. తిరు కెమెరా వ‌ర్క్ ప్ర‌తి ఫ్రేమ్ లో క‌నిపిస్తుంది. మ‌ద‌న‌ప‌ల్లిలో కొన్ని సీన్స్ చిత్రీక‌రించాం. ఈ సినిమాలో మూడు డిఫ‌రెంట్ రోల్స్ చేసాను. ఈ మూడింటిలో ఆత్రేయ క్యారెక్ట‌ర్ నాకు బాగా న‌చ్చింది. ఆత్రేయ క్యారెక్ట‌ర్ ని వేరే ఎవ‌రైనా చేస్తే బాగుంటుందేమో అనుకున్నాను. కానీ..విక్ర‌మ్ నేను చేస్తేనే బాగుంటుంది అని న‌న్ను క‌న్విన్స్ చేసారు. ఓ మంచి క్యారెక్ట‌ర్ నాతో చేయించినందుకు విక్ర‌మ్ కి ధ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఉండే యాక్ష‌న్, రొమాన్స్, కామెడీ..ఇలా అన్నీ ఉన్న కొత్త క‌థ‌తో రూపొందిన చిత్రం 24. చంద్ర‌బోస్ మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ స‌మ్మ‌ర్ లో వ‌స్తున్న 24 పిల్ల‌ల ద‌గ్గ‌ర్నుంచి పెద్ద వాళ్ల వ‌ర‌కు అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.