Rahul Gandhi:బీజేపీ ఏది చెబితే ఎంఐఎం అది చేస్తుంది: రాహుల్ గాంధీ

  • IndiaGlitz, [Tuesday,November 28 2023]

బీజేపీ చెప్పిన చోటే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అని.. వారంతా కలిసే పనిచేస్తారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో పార్టీ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌తో కలిసి కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాహుల్‌ మాట్లాడుతూ అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసూ లేదని.. అందుకే మోదీ ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులకు పార్లమెంట్‌లో బీఆర్ఎస్ మద్దతు పలికిందని తెలిపారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే మళ్లీ దొరల సర్కార్‌.. కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల సర్కార్‌ ఏర్పడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని మండిపడ్డారు.

తన ఎంపీ అభ్యర్థిత్వం రద్దు చేసి ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి తనను వెళ్లగొట్టినా బాధపడలేదని.. ఎందుకంటే దేశ ప్రజలందరి గుండెల్లో తనకు ఇల్లు ఉందని పేర్కొ్న్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు మంజూరు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.1200కు పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే అందిస్తామన్నారు. అంతేకాకుండా రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు చొప్పున.. యువ వికాసం పేరుతో విద్యార్థులకు రూ.5లక్షల ఆర్థికసాయం చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

అంతకుముందు ఖైరతాబాద్‌లో కాంట్రాక్ట్ కార్మికులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము పడుతున్న బాధలు, సమస్యలను రాహుల్‌కు కాంట్రాక్ట్ కార్మికులు చెప్పుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మీ అందరి సమస్యలు పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. మొత్తానికి ప్రచారం చివరిరోజు హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటనలు చేశారు.

More News

Chandrababu Naidu: బెయిల్ రద్దుపై చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జస్టిస్ బేలా ఎం త్రివేది

School Holidays:అలర్ట్: రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

తెలంగాణ ఎన్నికల సందర్భంగా రేపు(నవంబర్‌ 29), ఎల్లుండి(నవంబర్ 30) హైదరాబాద్ నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

Kaushik Reddy:ఓడిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా: కౌశిక్ రెడ్డి

హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

KCR:97 నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటనలు.. నేటితో ముగింపు

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Election Campaign:సాయంత్రంతో ముగియనున్న ప్రచారం.. ప్రలోభాలపర్వం మొదలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్ర 5 గంటల తర్వాత మైకులు మోత బంద్ కానుంది.