close
Choose your channels

Kaushik Reddy:ఓడిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా: కౌశిక్ రెడ్డి

Tuesday, November 28, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరిరోజు ప్రచారంలో భాగంగా భార్య, కుమార్తెతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రసంగిస్తూ తనకు ఒక్క అవకాశం ఇస్తే తన తల ప్రజల కడుపులో పెట్టుకుని హుజురాబాద్‌ను కాపాడుకుంటానని తెలిపారు.

ప్రజలు ఓటు వేస్తే డిసెంబర్‌ 3న నియోజకవర్గానికి విజయయాత్రగా వస్తానని... లేదంటే డిసెంబర్‌ 4న తన శవయాత్రకు ప్రజలు రావాలని వ్యాఖ్యానించారు. తనకు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయని.. ఒకటి ఎమ్మెల్యేగా గెలవడం లేక తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడమో అని పేర్కొన్నారు. తాను ఓడిపోతే ప్రచారం చేసిన ప్రాంతంలోనే తమ శవాలు కనిపిస్తాయని ఎమోషనల్ అయ్యారు. దీంతో ప్రచారానికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

2018 ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేసి గెలిచారు. అనంతరం మంత్రిగా కూడా పనిచేశారు. అయితే సీఎం కేసీఆర్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఉప ఎన్నికల్లో ఈటలపై పోటీకి సిద్ధమయ్యారు. అయితే గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను పోటీకి కేసీఆర్ దింపడంతో ఈటల సునాయాసంగా గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఈటలపై కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ కూడా మరోసారి ఇక్కడి నుంచి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.