బాలీవుడ్ రీమేక్‌లో రాజ్ త‌రుణ్‌

  • IndiaGlitz, [Wednesday,May 13 2020]

ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రాజ్‌త‌రుణ్ తర్వాత మంచి విజయాలను దక్కించుకుని హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈ యంగ్ హీరోకు ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌లు మాత్రం ద‌క్క‌డం లేదు. విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో ఒరేయ్ బుజ్జిగా సినిమాలో హీరోగా న‌టించాడు. ఈ సినిమాతో అయినా స‌క్సెస్ అందుకుని ట్రాక్‌లోకి రావాల‌ని ఎదురుచూస్తున్న త‌రుణంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా విడుద‌ల తాత్కాలికంగా ఆగింది.

ఇప్పుడు ఒరేయ్ బుజ్జిగా సినిమా కోసం రాజ్ త‌రుణ్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడు. అదే క్ర‌మంలో త‌న త‌దుప‌రి సినిమాల‌ను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ప్ర‌స్తుతం రాజ్ త‌రుణ్ చేతిలో రెండు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక‌టి గ‌విరెడ్డి శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా. కాగా.. మ‌రోచిత్రం సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్క‌బోయే చిత్రం. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొంద‌బోయే చిత్రం బాలీవుడ్ సినిమా డ్రీమ్ గ‌ర్ల్‌కు రీమేక్ అని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో రాజ్‌త‌రుణ్ తెలియ‌జేశాడు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన అధికారిక స‌మాచారాలు వెలువ‌డ‌తాయ‌ని స‌మాచారం.

More News

మ‌రోసారి త్రిష‌కు చిరు ఛాన్స్ ఇస్తాడా?

మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమాలో త్రిష జోడీ క‌ట్టింది. దాని త‌ర్వాత చిరు 152వ చిత్రం ‘ఆచార్య‌’లోనూ జోడీ క‌ట్టాల్సింది. అయితే చివ‌రి నిమిషంలో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో త‌ప్పుకుంటున్న‌ట్లు

మలయాళ రీమేక్‌లో ప‌వ‌న్‌..?

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టారు.

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ ఎల్‌జీ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది కన్నుమూసిన విషయం విదితమే. తెల్లారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు అప్రమత్తమవ్వడంతో మరణాలు చాలానే తగ్గాయి.

ఈసారి ఖైరతాబాద్ గణపతి ఒక్క అడుగే..!

తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని

'కరోనా' లాక్ డౌన్ 4.0పై తేల్చేసిన మోదీ..!

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా ఇండియాలో అయితే రోజురోజుకూ కరోనా కేసులు, అనుమానితులు, మరణాలు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.