'జెర్సీ' ని రిజెక్ట్ చేసిన రాజ్ తరుణ్...
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో రాజ్ తరుణ్‌కి సరైన సక్సెస్‌లు లేవు. అయితే `జెర్సీ`లో వచ్చిన అవకాశాన్ని రాజ్ తరుణ్ వద్దని అన్నాడట. రీసెంట్గా విడుదలైన `జెర్సీ` ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో నాని కొడుకు పెద్దగా అయినప్పుడు ఓ నోటెడ్ పర్సన్ కావాలని యూనిట్ భావించింది. రాజ్ తరుణ్‌ని సంప్రదించారు. అయితే పాత్ర పరిమితి తక్కువగా ఉండటంతో రాజ్ తరుణ్ చేయలేనని చెప్పేశాడట. దాంతో ఆ పాత్రను తమిళ నటుడు హరీష్ కల్యాణ్ పోషించాడు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన జెర్సీ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతుంది. 6 ఏళ్ల వ్యక్తి తన కొడుకు కోసం తన ప్రాణాలకు హాని అని తెలిసినా కూడా క్రికెట్‌గా మారుతాడు. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన జెర్సీలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.