అనుభవించు రాజా టీజర్: భీమవరం బుల్లోడుగా రాజ్ తరుణ్ సందడి

  • IndiaGlitz, [Thursday,September 23 2021]

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో మంచి ఊపులో వున్న రాజ్ తరుణ్‌ బాగానే స్టార్ డమ్ సంపాదించాడు. కానీ ఆ జోష్‌ను అలాగే కంటిన్యూ చేయడంలో ఈ కుర్రాడు ఫెయిల్ అయ్యాడు. కథల ఎంపికలో తప్పులు, అవకాశం వచ్చింది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడంతో ఫ్లాపులు పలకరించాయి. 'అనుభ‌వించురాజా' అంటూ మ‌ళ్లీ త‌న కామెడీ టైమింగ్ ని న‌మ్ముకున్నాడు. మెగా పవర్‌స్టార్ రామ్ చ‌రణ్ తేజ్ చేతుల మీదుగా ఈరోజున ‘‘అనుభవించు రాజా’’ ట్రైల‌ర్ విడుద‌లైంది.

‘‘ అయినా బంగారం గాడు ఊర్లోనీ, ఆడి పుంజు బ‌రిలోనీ ఉండ‌గా, ఇంకో పుంజు గెల‌వ‌డం క‌ష్ట‌మెహె..” అనే డైలాగ్ తో పూల రంగ‌డు గెట‌ప్ లో… రాజ్ త‌రుణ్ ఎంట్రీ ఇచ్చాడు. రాజ్ త‌రుణ్ బాడీ లాంగ్వేజ్ కి త‌గిన‌ట్టే, క్యారెక్ట‌రైజేష‌న్ పక్కాగా కుదిరింది. గోదారి జిల్లా వాళ్ల ఎట‌కారం, అక్క‌డి నేటివిటీ.. టీజ‌ర్‌లో కొట్టొచ్చినట్లు క‌నిపించింది. తెలుగు నాట సంక్రాంతి వేడుకలు, కోడిపందాలు అంటే భీమవరం గుర్తొస్తోంది. ఇది అచ్చంగా అలాంటి పందాల రాయుడి క‌థే. కోడి పందాలు, పేకాట‌, బెట్టింగ్ ఇదే జీవితంగా గ‌డిపేసే ఓ కుర్రాడి అల్ల‌రి కలిపితేనే ‘‘ అనుభ‌వించురాజా. ”

‘‘ తిప్పే కొద్దీ తిర‌గ‌డానికి అదేమైనా ఫ్యాను స్పీడేంట్రా… ఉన్న నాలుగు ఎంట్రుక‌లూ ఊడిపోతాయ్‌” అంటూ రాజ్ త‌రుణ్‌పైనే ఓ పంచ్ పడింది.

”నీ బాధ నాక‌ర్థ‌మైంది.. నువ్వు గెలిచి నా ప‌రువు కాపాడితే.. సాయింత్రం నీ గంప కింద నాలుగు పెట్ట‌లు పెడ‌తా” అంటూ కోడి పుంజుని బుజ్జ‌గించిన స్టైల్ చూస్తుంటే – క‌చ్చితంగా ఈ సినిమా ఫ‌న్ రైడ్ లా సాగుతుంద‌నిపిస్తోంది.

అన్న‌పూర్ణ స్టూడియోస్‌, ఎస్వీసీ (ఎల్‌.ఎల్‌.పీ) సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీ‌ను గ‌విరెడ్డి ద‌ర్శ‌కుడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్‌ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్‌ వంశీ, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్‌ రాజు, అరియానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More News

'మా' ఎన్నికలు: విష్ణు ప్యానెల్ ఇదే.. అనుభవానికి పెద్దపీట వేసిన మంచువారబ్బాయ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయద దగ్గర పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో రచ్చ చోటు చేసుకుంది.

రాధే శ్యామ్: ప్రభాస్ - పూజా హెగ్డే మధ్య విభేదాలు.. అసలు విషయం బయటపెట్టిన చిత్రయూనిట్

అదేంటో.. కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ రిలేషన్స్, నటీనటుల మధ్య విభేదాల తాలూకు విషయాలు చర్చల్లో నిలుస్తుంటాయి.

ఫ్యాన్సీ నంబర్ కోసం అక్షరాల రూ.17 లక్షలు ఖర్చుపెట్టిన ఎన్టీఆర్

సినిమాలో కంటెంట్, కటౌట్స్ సంగతి ఎలా ఉన్నా సెంటిమెంట్స్‌ను పక్కాగా ఫాలో అవ్వడం సినీపరిశ్రమలో కామన్. ఓపెనింగ్ డేట్ మొదలు రిలీజ్ డేట్ వరకూ ప్రతీ విషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు సినీజనాలు.

బిగ్‌బాస్ 5 తెలుగు: 'నన్ను తీసి పడేస్తారు.. జోకర్, లఫంగ్ అంటారు' హౌస్ మెంబర్స్‌పై లోబో సీరియస్

నామినేషన్స్‌తో హౌస్‌లో మరోసారి చిచ్చుపెట్టాడు బిగ్‌బాస్‌. సోమవారం మొదలైన ఈ రచ్చ బుధవారానికి కూడా కంటిన్యూ అయ్యింది. కంటెస్టెంట్‌ల మధ్య దూరాన్ని దగ్గర తగ్గించేందుకు ఫన్నీ టాస్క్‌ ఇచ్చాడు.

వ్యవస్థలపై పాశుపతాస్త్రం: ఆలోచింపజేస్తున్న సాయిధరమ్ తేజ్ ‘‘రిపబ్లిక్’’ ట్రైలర్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.