విజయ్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన రాజమౌళి

కరోనా పరిస్థితులన్నీ చక్కబడటంతో థియేటర్‌లలో సినిమాలు క్యూకడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌లైన ఆర్ఆర్ఆర్, బీస్ట్, కేజీఎఫ్‌లు వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం అనకాపల్లి నుంచి అమలాపురం వరకు ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తోంది. బాలీవుడ్‌లోని బడా సినిమాలు సైతం ఆర్ఆర్ఆర్ ధాటికి నిలబడటం లేదు. ప్రధాని మోడీ సహా విమర్శకుల ప్రశంసలు పొందిన ‘‘ది కశ్మీర్ ఫైల్స్ ’’ చిత్రం సైతం ఆర్ఆర్ఆర్‌కు తలవంచక తప్పలేదు.

ఇక.. అసలు మేటర్‌లోకి వెళితే.. తమిళ అగ్ర కథానాయకుడు , ఇళయ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌య‌న‌తార‌తో కోకిల‌, శివ కార్తికేయ‌న్‌తో డాక్ట‌ర్ సినిమాల‌ను తెరకెక్కించి సూప‌ర్‌హిట్ సొంతం చేసుకున్న నెల్స‌న్ దిలీప్ కుమార్ .. సూపర్‌స్టార్ విజ‌య్‌తో ఎలాంటి సినిమా చేస్తారోన‌ని ఉత్కంఠ నెల‌కొంది. అయితే ‘బీస్ట్’ ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత అంచ‌నాలు ఓ రేంజ్‌కు చేరాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఈరోజు బీస్ట్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్ర విడుదల నేపథ్యంలో తమిళనాట పండుగ వాతావరణం నెలకొంది.

సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తున్నప్పటికీ.. వరుస సెలవులు కారణంగా తమిళనాట ప్రేక్షకులు బీస్ట్ చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో థియేటర్‌కు వెళ్లిన వారికి అనుకోని షాక్ తగిలింది. బీస్ట్ సినిమా మధ్యలో ఆర్ఆర్ఆర్ ప్రదర్శితం కావడంతో ప్రేక్షకులకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. బీస్ట్ ఫస్ట్ హాఫ్ ముగిశాక పాప్ కార్న్, కూల్‌డ్రింక్ తీసుకుని సెకండాఫ్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తెరపై ఆర్ఆర్ఆర్ కనిపించింది. అంతే విజయ్ ఫ్యాన్స్ ఈలలు, కేకలు వేయడంతో థియేటర్ యాజమాన్యం నాలుక కరచుకుని వెంటనే బీస్ట్ సెకండాఫ్ వేశారు. ఈ పరిణామంతో థియేటర్‌లో కాసేపు సందడి నెలకొంది.

More News

బిగ్‌బాస్ ఓటీటీ: గాడిలో పడుతోన్న గేమ్.. ఆ కంటెస్టెంట్ ఆటకు జనం ఫిదా, టైటిల్ అతనిదేనా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్నీ...

ఎనిమిదేళ్ల కష్టం... థియేటర్లో ఫొటోలు, వీడియోలు తీయొద్దు : ప్రేక్షకులకు కేజీఎఫ్ టీమ్ రిక్వెస్ట్

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బీస్ట్ విడుదల : విజయ్ ఫ్యాన్స్ వీరంగం .. సినిమా నచ్చలేదంటూ,  స్క్రీన్‌కు నిప్పు

తమిళ అగ్ర కథానాయకుడు , ఇళయ దళపతి విజయ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే.

డ్యాన్సులు, ఫైట్స్‌ల్లో చిరు- చరణ్ జోరు : ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న ‘‘ఆచార్య’’ ట్రైలర్

సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. కెరీర్‌లో పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం..

తండ్రి కలను నిజం చేసిన అలీ కూతురు.. మురిసిపోతున్న కుటుంబం, ఫ్యాన్స్ విషెస్

పిల్లలు పుట్టగానే సరిపోదు.. వాళ్లు పెరిగి ప్రయోజకులై , వారి గురించి నలుగురూ చెబితే వినాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు.