ఆ పుకార్లు నమ్మొద్దు.. అరవింద్ స్వామిలాగా అయితే ఓకే!

  • IndiaGlitz, [Tuesday,July 02 2019]

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలోనే విలన్‌గా మారబోతున్నారని.. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య చిత్రాల్లో అలా నటిస్తారని గత కొన్ని రోజులు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజశేఖర్ అభిమానులు నిజమేనేమో.. పరిస్థితులు అనుకూలించకపోతే.. విలన్ అయినా తప్పదేమో అని ఫ్యాన్స్ భావించారు.

అయితే హీరో విలన్‌గా మారడంలో ఎలాంటి తప్పులేదు. రేపొద్దున మళ్లీ యథావిధిగా హీరో అవకాశాలు వస్తే ఎంచక్కా.. అటు ఇటు రెండు బ్యాటింగ్‌లు చేసుకోవచ్చు అంతే. అలా చేస్తున్న హీరోలు చాలా మందే కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌లోనూ ఉన్నారు. రాజశేఖర్ విషయంలో ఈ పుకార్లు ఎవరు పుట్టించారో తెలియదుగానీ.. యాంగ్రీస్టార్ మాత్రం ఇంటర్వ్యూ వేదికగా ఒకింత యాంగ్రీగానే రియాక్ట్ అయ్యారు.

బాలకృష్ణ, చిరంజీవిల చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో అర్థంకావడంలేదు. అవన్నీ పుకార్లు మాత్రం.. ఎవరూ నమ్మొద్దు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభిస్తాను. విలన్‌గా చేయడం పట్ల నాకేమీ అభ్యంతరాలు లేవు. కాకపోతే ‘ధృవ’ చిత్రంలో అరవింద్ స్వామికి లభించినటువంటి క్యారక్టర్‌ను కోరుకుంటాను. అరవింద సమేత, శ్రీమంతుడు చిత్రాల్లో జగపతిబాబు పాత్రలు బాగా నచ్చాయి. అలాంటి రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను. అయితే.. సాధారణ ప్రతినాయక పాత్రలు మాత్రం చేయనుగాక చేయను అని రాజశేఖర్ క్లారిటీ ఇచ్చేశారు. కాగా.. రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ‘కల్కి’ ఇంటర్వ్యూలో భాగంగా రాజశేఖర్ పై విషయాలు పంచుకున్నారు.

More News

రాధికా శ‌ర‌త్‌కుమార్ ను అరెస్ట్ చేయండి

రాధికా శ‌ర‌త్‌కుమార్‌ను అరెస్ట్ చేయాల‌ని చెన్నై సైదాపేట కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఓ చెక్కు బౌన్స్ కేసులో వారిరువురి మీద కేసు రిజిస్ట‌ర్ అయింది. ప‌లుమార్లు ఉత్త‌ర్వులు జారీ చేసినా కోర్టుకు

ఎవరిపైనా మాకు కక్ష లేదు.. ఆకస్మిక తనిఖీలుంటాయ్!

కాంట్రాక్టర్లను వేధించడం తమ ఉద్దేశం కాదని, ఎవరిపైనా మా ప్రభుత్వానికి కక్ష లేదని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు.

మెగా హీరోల‌కు రాయ‌ల‌సీమ‌లో పోరు

మెగా హీరోల‌కు రాయ‌ల‌సీమ వాసుల‌తో పోరు త‌ప్ప‌డం లేదు. మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ఆఫీస్ ముందు ఇటీవ‌ల ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సంత‌తి వ‌చ్చి గొడ‌వ చేసిన విష‌యం తెలిసిందే.

బాలయ్యను ఫాలో అవుతున్న బీజేపీ ఎంపీ.. అధిష్టానం ఆగ్రహం!

ఓహ్.. బీజేపీ ఎంపీ.. అది కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ కాకుండా ఇంకెవరో బాలయ్యను ఫాలో అవుతున్నారంటే ఆషామాషీ విషయమేం కాదు.

లోక్‌సభలో మోదీ సర్కార్‌ను తూర్పారబెట్టిన సోనియా!

రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ చేస్తున్న కొన్ని పనులు ప్రతిక్షాలకు రుచించట్లేదు. పార్లమెంట్ సమావేశాల వేదికగా..