Rajayogam: అన్ని కమర్షియల్ అంశాలతో 'రాజయోగం' ట్రైలర్ ఆకట్టుకుంది - దర్శకుడు మారుతి

  • IndiaGlitz, [Wednesday,December 21 2022]

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజయోగం . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందన్న ఆయన చిత్ర బృందానికి విశెస్ తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ...రాజయోగం ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో రొమాన్స్, యాక్షన్, కామెడీ వంటి అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. నా స్నేహితుడు గణపతి ఈసారి కంప్లీట్ కమర్షియల్ సినిమా చేశాడు. హీరో సాయి రోనక్ కు కూడా మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ లో ప్రతిభ చూపించారు. ఇండస్ట్రీలో ఉన్న పేరున్న కమెడియన్లంతా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. నిర్మాత మణి లక్ష్మణ్ గారికి కంగ్రాంట్స్. ఈ సినిమా యూనిట్ అందరికీ రాజయోగం తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

రాజయోగం చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ కు మంచి అప్లాజ్ వస్తుండగా...తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా అన్ని కమర్షియల్ హంగులతో ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు పెంచుతోంది.

అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - విజయ్ సి కుమార్, ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్, సంగీతం - అరుణ్ మురళీధరన్, డైలాగ్స్ - చింతపల్లి రమణ, పీఆర్వో - జీఎస్కే మీడియా, సహ నిర్మాతలు - డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్, నిర్మాత - మణి లక్ష్మణ్ రావు, రచన దర్శకత్వం - రామ్ గణపతి.

More News

Rangamarthanda: మెగా కంఠంలో 'నేనొక నటుడ్ని' షాయరీ

రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యింది.

అమెరికా, చైనాలో కోవిడ్ విజృంభణ : భారత్ అప్రమత్తం.. నిర్లక్ష్యం వద్దు , రాష్ట్రాలకు హెచ్చరికలు

చైనాలో కరోనా స్వైర విహారం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది.

TTD EO Dharmareddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి.. వచ్చే నెలలో పెళ్లి, అంతలోనే

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి (28) కన్నుమూశారు.

KTR: డ్రగ్స్ టెస్ట్ కోసం కిడ్నీ, బ్లడ్ కూడా ఇస్తా.. నువ్వు చెప్పు దెబ్బలకు సిద్ధమా: బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్

తాను డ్రగ్స్‌కు బానిసనంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. తాను డ్రగ్స్ టెస్ట్‌కు రెడీ అని ప్రకటించారు.

టాలీవుడ్‌లో విషాదం : అలనాటి నటుడు హరనాథ్ కుమార్తె పద్మజారాజు హఠాన్మరణం .. ఆ కల తీరకుండానే

అలనాటి అందాల నటుడు హరనాథ్ కుమార్తె , ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు హఠాన్మరణం చెందారు.