close
Choose your channels

TTD EO Dharmareddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి.. వచ్చే నెలలో పెళ్లి, అంతలోనే

Wednesday, December 21, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

TTD EO Dharmareddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి.. వచ్చే నెలలో పెళ్లి, అంతలోనే

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి (28) కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత ఆదివారం గుండెపోటుకు గురైన ఆయనను కావేరి ఆసుపత్రికి తరలించారు. చంద్రమౌళిని రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో బుధవారం ఆయన కన్నుమూసినట్లు కావేరి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. వచ్చే నెలలో వివాహం జరగాల్సి వుండగా.. అంతలోనే చంద్రమౌళి కన్నుమూయడంతో ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

శుభలేఖలు పంచేందుకు చెన్నైకి :

ఇటీవలే టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి నిశ్చితార్ధం జరగ్గా.. జనవరిలో వీరి వివాహం జరగాల్సి వుంది. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా వుండటంతో పాటు శుభలేఖలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు పెళ్లిపత్రికలు ఇవ్వడానికి ఆదివారం మధ్యాహ్నం ఆయన కారులో నగరానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గుండెలో నొప్పిగా వుందని కారులోనే వున్న స్నేహితుడితో చెప్పగా... శివను కావేరి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ధర్మారెడ్డి దంపతులు, కాబోయే వియ్యంకుడు శేఖర్ రెడ్డిలు కావేరి ఆసుపత్రికి వెళ్లారు. వీరితో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి‌లు కూడా కావేరి ఆసుపత్రికి వెళ్లారు.

ఫలించని వైద్యుల యత్నాలు :

మంగళవారం సాయంత్రం కూడా చంద్రమౌళి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం విషమంగానే వుందని.. ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని కావేరి ఆసుపత్రి తెలిపింది. నిపుణుల పర్యవేక్షణలో చంద్రమౌళి ఆరోగ్య పరిస్ధితిని పరీక్షిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం నాటికి పరిస్ధితి మరింత క్షీణించడంతో ఆయన కన్నుమూశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.