రజనీ ఆమెను జూనియర్ ఐష్ అని పిలిచాడట.....

  • IndiaGlitz, [Wednesday,July 20 2016]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో న‌టించ‌డానికి హీరోయిన్స్ అంద‌రూ ఆస‌క్తి చూపుతుంటారు. అలా ఆస‌క్తి చూప‌డ‌మే కాదు, సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అన‌తి కాలంలోనే ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్న హీరోయిన్ అమీ జాక్స‌న్‌. ఐ, పోలీస్ వంటి చిత్రాల‌తో ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ఈ బ్రిటీష్ భామ ఐ త‌ర్వాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రోబో సీక్వెల్ 2.0లో అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది. ర‌జనీకాంత్ చాలా గొప్ప వ్య‌క్తి. ఆయ‌న‌తో న‌టించ‌డం ఎంతో సంతోషాన్నిచ్చే విష‌యం. ఆయ‌న న‌న్ను సెట్స్‌లో జూనియ‌ర్ ఐష్ అని పిలిచేవారు. ఇక ద‌ర్శ‌కుడు శంక‌ర్ నా క్యారెక్ట‌ర్‌ను చాలా డిఫ‌రెంట్‌గా ప్రెజెంట్ చేస్తున్నార‌ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రయూనిట్ తో ఆగస్టులో రజనీకాంత్ జాయినవుతాడట.

More News

హన్సిక పై తమిళ నిర్మాత చీటింగ్ కేసు...

సినిమాల్లో గ్లామర్ తో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న హీరోయిన్ హన్సిక పై ఓ తమిళ నిర్మాత చీటింగ్ కేసు నమోదు చేయబోతున్నాడట.

సుల్తాన్ ని మెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం సుల్తాన్.

సాయిధరమ్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది...

వరుస విజయాల సాధిస్తూ ముందుకు సాగుతున్న మెగా క్యాంప్ హీరో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్

ఆ విషయంలో...బాహుబలి తర్వాతే కబాలి

యూరప్ లో అత్యధిక సిటింగ్ కెసాసిటీ గల థియటర్ పారీస్ లోని లీ గ్రాండ్ రెక్స్ థియేటర్.

ఆ రోజే...చుట్టాల‌బ్బాయి కూడా వ‌స్తున్నాడు

సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టించారు. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై రామ్, వెంక‌ట్ త‌లారి  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.