close
Choose your channels

హన్సిక పై తమిళ నిర్మాత చీటింగ్ కేసు...

Wednesday, July 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినిమాల్లో గ్లామ‌ర్‌తో పాటు సేవా కార్య‌క్ర‌మాల్లో కూడా ముందుండి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న హీరోయిన్ హ‌న్సిక పై ఓ త‌మిళ నిర్మాత చీటింగ్ కేసు న‌మోదు చేయ‌బోతున్నాడ‌ట‌. వివరాల్లోకెళ్తే..విజ‌య్ హీరోగా న‌టించిన `పులి` చిత్ర నిర్మాతల్లో ఒక‌రైన పి.టి.సెల్వ‌కుమార్ ఆ చిత్రంలో హ‌న్సిక‌ను ఓ హీరోయిన్‌గా తీసుకున్నాడు.

త‌ర్వాత `రంగం` ఫేమ్ జీవా హీరోగా చేసిన `పోకిరి రాజా` చిత్రంలో కూడా హ‌న్సిక‌నే హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ సినిమా ఆడియో విడుద‌లైన ప్లాప్ కూడా అయ్యింది. అయితే ఈ సినిమా ఆడియో వేడుక‌కు హ‌న్సిక హాజ‌ర‌వుతాన‌ని చెప్ప‌డంతో నిర్మాత హ‌న్సిక కోసం ఫైవ్ స్టార్ హోట‌ల్‌, డిజైన‌ర్ గ‌ట్రా ఏర్పాట్ల‌కు బాగానే ఖ‌ర్చు పెట్టాడ‌ట‌. కానీ హ‌న్సిక చివ‌ర‌కు వేడుక‌కు హాజ‌ర కాలేక‌పోయింది. అయితే ఆ మొత్తాన్ని త‌న‌కు న‌ష్ట‌ప‌రిహారంగా చెల్లించాల‌ని కోర‌గా హ‌న్సిక బదులివ్వ‌క‌పోవ‌డంతో స‌ద‌రు నిర్మాత హ‌న్సిక‌పై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోవాల‌ని అనుకుంటున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.