ర‌జ‌నీ క‌బాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Monday,November 23 2015]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌లేషియాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తుంది. మాఫియా డాన్ గా.. తెల్ల‌టి గ‌డ్డంతో ఓల్డ్ గెట‌ప్ లో ఉన్న ర‌జ‌నీ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దన్షిక, రిత్వికా, దినేష్‌, కలైయరశన్‌, కిశోర్‌లతోపాటు పలువురు కొత్త నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ర‌జనీకాంత్ తో ఇదివరకు న‌టించ‌ని నటులు ఈ చిత్రంలో న‌టిస్తుండ‌డం విశేషం. అలాగే సినిమాకి ఎంతో కీల‌క‌మైన విల‌న్ పాత్ర‌కు మ‌లేషియా న‌టుడిని సెలెక్ట్ చేసార‌ట‌. త‌మిళ్ లో క‌బాలి టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీకి తెలుగులో మ‌హ‌దేవ్ అనే టైటిల్ ఫిక్స్ చేసార‌ట‌. ర‌జ‌నీ ఎంతో న‌మ్మ‌కం పెట్టుకుని చేస్తున్న క‌బాలి చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

మెగాస్టార్ ఆ సినిమా చూసాడు...

మెగాస్టార్ 150వ సినిమా గురించి తనే స్వయంగా దసరా లోపు ప్రకటిస్తానని చెప్పారు.దసరా...దీపావళి వెళ్లిపోయాయి..కానీ ఇప్పటి వరకు 150వ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.

కళ్యాణ్ రామ్ న్యూమూవీ డీటైల్స్..

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన షేర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.దీంతో తదుపరి చిత్రంతో ఎలాగైనా సరే విజయం సాధించాలనుకుంటున్నాడు.

ప్ర‌కాష్ రాజ్ న్యూమూవీకి వెరైటీ టైటిల్

తెలుగు, త‌మిళ‌, కన్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించిన త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్.

సర్ధార్ తో సంజన...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్.ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు.పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

నాయ‌కి వ‌చ్చేస్తుంది

నిషా క‌ళ్ల త్రిష న‌టిస్తున్న‌తాజా చిత్రం నాయ‌కి. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తున్నారు.