రజనీ కబాలి కథ ఇదే..

  • IndiaGlitz, [Thursday,November 05 2015]

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తుంది. ఈ చిత్రం మ‌లేషియాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక క‌బాలి క‌థ విష‌యానికి వ‌స్తే...ర‌జ‌నీకాంత్ మాఫియా డాన్. పెళ్లి చేసుకుని..సెటిలైన త‌ర్వాత త‌న కుమార్తెను కిడ్నాప్ చేస్తే మ‌ళ్లీ త‌న పూర్వ ఆశ్ర‌మం మాఫియాలో ప్ర‌వేశించి త‌న కుమార్తెను ఎలా కాపాడుకున్నాడు అనే క‌థాంశంతో క‌బాలి సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. విక్ర‌మ సింహా, లింగా వ‌రుస ప‌రాజ‌య‌ల త‌ర్వాత ర‌జ‌నీ చేస్తున్న ఈ సినిమా పై ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతున్న క‌బాలి ఎలాంటి సంచ‌ల‌నం స్రుష్టిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

నితిన్ న్యూమూవీ డీటైల్స్..

యువ హీరో నితిన్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అ..ఆ.

స్వాతికి 'త్రిపుర' గిఫ్ట్ లాంటి సినిమానా?

పాత్ర ఎలాంటిదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయగల నేర్పు తెలుగమ్మాయి స్వాతి సొంతం.అందుకే తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో మంచి మంచి క్యారెక్టర్స్ లో ఒదిగిపోయింది ఈ అమ్మడు.

హీరోయిన్ల లక్ పై ఆధార పడ్డ హీరో

చూడ్డానికి అందంగా ఉంటాడు.బాగానే యాక్ట్ చేస్తాడు.కానీ అదృష్టమే అతన్ని దూరం పెడుతోంది.ఆ హీరో మరెవరో కాదు. ''అందాల రాక్షసి''తో పరిచయమైన నవీన్ చంద్ర.

లావణ్యకి రాసిపెట్టుందా?

''భలే భలే మగాడివోయ్''తో సాలిడ్ హిట్ ని కొట్టింది ''అందాల రాక్షసి''లావణ్య త్రిపాఠి.హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మూడేళ్ల తరువాత ఆ అమ్మడికి లభించిన విజయమిది.

డిక్టేటర్ ఆడియో డేట్ ఫిక్స్..

నందమూరి నటసింహాం బాలక్రిష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్.ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలసి డైరెక్టర్ శ్రీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.