రజనీ కొత్త సినిమా టైటిల్‌ ఏంటంటే?

  • IndiaGlitz, [Saturday,November 02 2019]

ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌' సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారో లేదో.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన 168వ చిత్రాన్ని వెంటనే ప్రకటించారు. డైరెక్టర్‌ శివ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.హీరోలను మాస్‌గా చూపించడంలో శివ స్పెషలిస్ట్‌. అందుకనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ శివతో వరుసగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసమ్‌ సినిమాలను చేశాడు. ఇప్పుడు రజనీకాంత్‌తో శివ సినిమా అనగా మాస్‌ ఇమేజ్‌ ఉన్న రజనీకాంత్‌ను శివ ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

రజనీకాంత్‌తో శివాజీ, రోబో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరగుతున్నాయి. రజనీకాంత్‌తో మంజు వారియర్‌, కీర్తిసురేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తారని కూడా వార్తలు వినిపించాయి. మరి శివ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ పెడతాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఎప్పటిలాగానే శివ తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వి అరజనీకాంత్‌తో మంజు వారియర్‌, కీర్తిసురేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తారని కూడా వార్తలు వినిపించాయి. మరి శివ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ పెడతాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఎప్పటిలాగానే శివ తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వి అక్షరం వచ్చేలా వ్యూహం అనే టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నాడని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. రజనీకాంత్‌ 'దర్బార్‌' చిత్రం సంక్రాంతికి విడుదల కాగానే.. వ్యూహం సినిమా వచ్చే సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారట నిర్మాతలు.

More News

ముగ్గురూ అందుకు ఒప్పుకుంటారా?

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న వారిలో ఖాన్‌ త్రయం ఎప్పుడూ ముందుంటుంది. ఈ ముగ్గురూ ముగ్గురే.

త్వరలో వెండితెరపైకి రానున్న మౌనిక

బుల్లితెర వీక్షకులకు మౌనిక గుంటుక ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.

సూపర్ స్టార్ మహేష్ ప్రశంసలందుకున్న 'ఖైది'

యాంగ్రీ హీరో కార్తీ నటించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’ దీపావళి బ్లాక్ బస్టర్ గా సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

పవన్ కీలక నిర్ణయం: యువ ద‌ర్శ‌కుడితో జ‌ట్టు

2019 ఎన్నిక‌లు త‌ర్వాత జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తార‌నే వార్త‌లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతూనే ఉన్నాయి.

సూపర్ స్టార్ కు అరుదైన గౌర‌వం

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ న‌వంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో జ‌ర‌గ‌బోయే గోల్డెన్ జూబ్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (ఐఎఫ్ఎఫ్ఐ) అవార్డ్స్ 2019లో