ఏపీలో కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికలు

నేడు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ తరపున తొలి ఓటు ముఖ్యమంత్రి జగన్ వేయగా.. టీడీపీ తరుపున హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తొలి ఓటు వేశారు. ఇప్పటికే మాక్ పోలింగ్‌ను నిర్వహించిన ఇరు పార్టీలు.. తమ పార్టీల ఎమ్మెల్యేలకు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో తెలిపాయి. కాగా వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమాల్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి, అలాగే టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో నిలిచారు.

వైసీపీ తరుఫున పోటీ చేసిన తొలి ముగ్గురు ఎమ్మెల్యేలకు 38.. నాలుగో అభ్యర్దికి 37 ఓట్లను వైసీపీ కేటాయించింది. అయితే టీడీపీ కీలక నేత అరెస్ట్ అయిన కారణంగా ఆయన ఓటేసేందుకు హాజరు కాలేదు. ఆయనకు ఓటేసేందుకు అవకాశం కల్పించాలని టీడీపీ నేతలు ఈసీని కోరారు. ఈసీ అనుమతిస్తే అచ్చెన్నాయుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

More News

సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని జీర్ణించుకోలేక విశాఖ యువతి ఆత్మహత్య

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్‌కి ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ అభిమానులున్నారు.

తనకు కాబోయే భర్త ఫోటోను రివీల్ చేసిన మెగా డాటర్

గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయంలో ఎన్నో రూమర్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈఎస్ఐ స్కాంలో ఏ1 నిందితుడి అరెస్టుపై హైకోర్టులో వాదనలు

ఈఎస్ఐ స్కాంకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో గంటన్నరపాటు వాదనలు జరిగాయి.

ప్ర‌భాస్ 21.. దీపిక కండీష‌న్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

‘ఆర్ఆర్ఆర్‌’ ట్ర‌యిల్ షూట్ క్యాన్సిల్‌..!

దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిపై రెండు తెలుగు ప్ర‌భుత్వాలు పెద్ద బాధ్య‌త‌నే పెట్టాయ‌నుకోవాలి.